పెట్రోమంటలకు బడ్జెట్‌లో ఉపశమనం..? - as fuel prices rise centre mulls excise duty cut
close

Updated : 30/01/2021 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోమంటలకు బడ్జెట్‌లో ఉపశమనం..?

 ప్రతిపాదన పంపిన పెట్రోలియం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొవిడ్‌ సమయంలో పన్నులు పెంచడంతో ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కాకపోతే.. అప్పట్లో ఆదాయవనరులు లేకపోవడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. దీంతో ఇప్పటికైనా ఇంధనంపై పన్నులను తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.90 మార్కును దాటడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

2020లో కరోనా లాక్‌డౌన్‌, ట్రావెల్‌ నిబంధనలు విధించడంతో చాలా చోట్ల చమురుకు డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా ముడిచమురు ధరలు 60 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో 19 డాలర్లకు చేరాయి. ఆ తర్వాత మెల్లగా ధరలు పెరుగుతూ వచ్చి జనవరి 22 నాటికి బ్రెంట్‌ ముడిచమురు ధర 55 .37 డాలర్లను తాకింది.  లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని లీటర్‌కు రూ.32.98, డీజిల్‌పై రూ.19.98 పెంచారు. గతంలో ఇది పెట్రోల్‌పై 31.83, డీజిల్‌పై15.83గా ఉండేది. ప్రతి లీటర్‌ ఇంధనంపై విధించే ఒక రూపాయి ఎక్సైజ్‌ డ్యూటీతో ప్రభుత్వానికి అదనంగా రూ.14,500 కోట్లు ఆదాయం వస్తుంది.

తాజాగా పెట్రోలియం, సహజవాయువు శాఖ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని ఇందులో సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో  భారత్‌లో అదనపు సుంకాలు విధించారు.  ఇప్పుడు వాటిని తగ్గించమని ఇంధన శాఖ కోరింది. ముంబయిలో ఇటీవల పెట్రోల్‌ ధర లీటరు రూ.92.04కు చేరింది.

ఇదీ చదవండి..

బడ్జెట్‌ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని