ఆడీ కొత్త కారు@రూ.42.34 లక్షలు - audi launches new version of a4 in india
close

Updated : 05/01/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడీ కొత్త కారు@రూ.42.34 లక్షలు

దిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ భారత విపణిలోకి ఏ4 సరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. సెడాన్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ కారు ధర 42.34లక్షలు (ఎక్స్‌-షోరూం)గా నిర్ణయించారు. ఫిఫ్త్‌ జనరేషన్‌కు చెందిన ఈ కారు రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉంది. 190 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 7.3 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 241 కి.మీ అత్యధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతమని కంపెనీ పేర్కొంది.

ప్రీమియం ప్లస్‌, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్స్‌ని మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే వెసులుబాటు కల్పించారు. కీ లెస్‌ ఎంట్రీ, జెస్టర్‌ బేస్డ్‌ బూట్‌ లిడ్‌ ఓపెనింగ్‌, పవర్‌ ఫ్రంట్‌ సీట్స్‌, డ్రైవర్‌ సీట్‌కి మెమరీ ఫీచర్‌, త్రీ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 12వీ హైబ్రిడ్‌ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఇంధన వినియోగాన్ని నియంత్రించవచ్చు. బెల్ట్‌ ఆల్టర్నేటర్‌ స్టార్టర్‌ అనే కొత్త సాంకేతికతను దీనిలో పొందుపరిచారు.

ఈ సందర్భంగా ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరాన్ని ఏ4 విడుదలతో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త ఫీచర్లతో ఇది వినియోగదారులకు అద్భుతమైన అనుభూతినివ్వనుందన్నారు. 2021లో మరిన్ని మోడళ్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. త్వరలోనే ఆడీ ఈ-ట్రాన్‌ విడుదలపై ప్రకటన ఉంటుందన్నారు.

ఇవీ చదవండి..

ఈ బ్యాటరీ జీవితకాలం 16 ఏళ్లు..!

జనవరి, 2021 నుంచి పెరగనున్న కార్ల ధరలు..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని