DHFL: మరో ₹6,182 కోట్ల అక్రమ లావాదేవీలు - auditor grant thornton unearths another fraudulent transaction in dhfl
close

Updated : 22/02/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DHFL: మరో ₹6,182 కోట్ల అక్రమ లావాదేవీలు

గుర్తించిన ఆడిటింగ్‌ సంస్థ గ్రాంట్‌ థోర్న్‌టన్‌

దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో మరో రూ.6,182.11 కోట్ల మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్లు ఆడిటింగ్ సంస్థ గ్రాంట్‌ థోర్న్‌టన్ గుర్తించింది. తక్కువ అంచనాలు, మోసం, ప్రిఫరెన్షియల్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల ఈ అవకతవకలు జరిగినట్లు తెలిపింది. పైన చెప్పిన రూ.6,182 కోట్ల లావాదేవీల్లో రూ.5,381.90 కోట్లు అసలు కాగా.. వడ్డీ రూ.800.21 కోట్లు అని ఎక్స్ఛేంజీలకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలియజేసింది. ఒకేసారి కాకుండా కొన్ని రోజుల వ్యవధిలో ఈ మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. గతంలోనూ రెండు సార్లు భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు గ్రాంట్‌ థోర్న్‌టన్ గుర్తించింది.   

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిర్వహణ ప్రస్తుతం దివాలా స్మృతి చట్టం కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్‌ కింద ఉన్న విషయం తెలిసిందే. అయితే, సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటర్‌.. గ్రాంట్‌ థోర్న్‌టన్‌ సంస్థ సహాయాన్ని కోరారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో దివాలా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు విలువ క్రితం సెషన్‌తో పోలిస్తే 4.75 శాతం కుంగి రూ.18.05 వద్ద కొనసాగుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని