ఏబీఎస్‌ టెక్నాలజీతో కొత్త ప్లాటినా - bajaj auto drives in platina 110 priced at rs 65920
close

Published : 04/03/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏబీఎస్‌ టెక్నాలజీతో కొత్త ప్లాటినా

దిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన విజయవంతమైన మోడల్‌ ప్లాటినాకు కొత్త హంగులు జోడించి ప్లాటినా-110 పేరుతో దీన్ని విడుదల చేసింది. 115 సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌లో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) అందిస్తుండడం ప్రత్యేకత. ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తున్న ఈ బైక్‌ ధరను రూ.65,920 (ఎక్స్‌ షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది.

దేశ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సెగ్మెంట్‌ ఏబీఎస్‌ టెక్నాలజీని తీసుకొచ్చామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (డొమెస్టిక్‌ మోటార్‌ సైకిల్‌ యూనిట్‌) సారంగ్‌ కనడే ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సుమారు 70 లక్షల మంది ప్లాటినాను సొంతం చేసుకున్నారని చెప్పారు.

ఇవీ చదవండి..
అలా చేస్తే రూ. 75కే లీటర్‌ పెట్రోల్‌
ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.5శాతం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని