కొత్త ప్లాటినా 100 @రూ.53,920 - bajaj auto rides in platina 100 es
close

Published : 02/03/2021 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ప్లాటినా 100 @రూ.53,920

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ బైక్‌ను మార్కెట్లోకి మంగళవారం విడుదల చేసింది. ప్లాటినా బ్రాండ్‌ ప్రత్యేకత అయిన ‘కంఫర్టెక్‌ సాంకేతికత’తో వస్తున్న ఈ బైక్‌లో అధునాతన ఫీచర్లను చేర్చారు. దూర ప్రయాణాల్లో అనువుగా ఉండేలా స్ప్రింగ్‌-ఇన్‌-స్ర్పింగ్‌ సస్పెన్షన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్లాటినాలో తొలిసారి ట్యూబ్‌లెస్‌ టైర్లను పొందుపరిచారు. 102 సీసీ, ఫోర్‌ స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ 7,500 ఆర్‌పీఎం వద్ద 7.9 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. అలాగే 5,500 ఆర్‌పీఎం వద్ద 8.34 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాక్‌టెయిల్‌ వైన్‌ రెడ్‌, ఎబోనీ బ్లాక్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంది. అన్ని బజాజ్‌ ఆటో షోరూంలలో నేటి నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. ఇక దీని ధరను రూ.53,920(ఎక్స్‌షోరూం, దిల్లీ)గా నిర్ణయించారు.

ఇవీ చదవండి...

వాహన విక్రయాలు భేష్‌

గంటకు 200 కి.మీ వేగం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని