bajaj finance: ఆన్‌లైన్‌లో బ‌జాజ్ ఫైనాన్స్ ‘ఎఫ్‌డీ’ - bajaj-finance-online-FD
close

Updated : 24/07/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

bajaj finance: ఆన్‌లైన్‌లో బ‌జాజ్ ఫైనాన్స్ ‘ఎఫ్‌డీ’

బ‌జాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వ‌డ్డీ ద్వారా అధిక రాబ‌డిని ఆశించొచ్చు. బ‌జాజ్ ఫైనాన్స్ ఆఫీస్ బ్రాంచ్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండానే నేరుగా ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను చేయోచ్చు. పొదుపు విష‌యానికి వ‌స్తే, మీ క‌నీస జీవ‌న వ్య‌యాల‌కు స‌మాన‌మైన మొత్తాన్ని సేక‌రించ‌డం మంచిది.  మీ పొదుపు.. వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, అక‌స్మిక ఖ‌ర్చులు, క‌నీస జీవ‌న వ్య‌యాల‌కు ప‌నికొచ్చే విధంగా ఉండ‌టానికి మీకు స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు. యుక్త‌వ‌య‌స్సు ప్రారంభంలోనే పొదుపు, పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాల‌ని ఆర్థిక నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. ఇది మీకు త‌గినంత‌ స‌మ‌యంలో రాబ‌డుల‌ను పొందేలా చేస్తుంది.

మీరు పెట్టుబ‌డి పెట్ట‌డానికి మార్కెట్‌లో అనేక ఆర్థిక ప‌థ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ, త‌క్కువ రిస్క్ ఉండే ప‌థ‌కాలు ఎంపిక చేసుకోవ‌డం ఇక్క‌డ చాలా ముఖ్యం. ఇది ఖ‌చ్చిత‌మైన‌ రాబ‌డిని ఇస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కువ‌మంది ఇష్ట‌ప‌డే పెట్టుబ‌డి ఎంపిక‌ల‌లో ముందున్నాయి. మీరు భ‌ద్ర‌త, స‌మ‌తుల్య‌త‌, కొద్దిగ‌యిన‌ అధిక రాబ‌డి కోసం చూస్తున్న‌ట్ల‌యితే బ‌జాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీలో పెట్టుబ‌డి కూడా మంచి ఎంపికే. ఈ డిపాజిట్‌పై సీనియ‌ర్ సిటిజ‌న్లు బేస్ రేటుపై 0.25% అద‌న‌పు వ‌డ్డీ రేటును పొంద‌వ‌చ్చు. ఆన్‌లైన్ ధ‌ర‌ఖాస్తు చేసుకున్న సీనియ‌ర్ కాని పౌరులు కూడా 0.10% అద‌న‌పు వ‌డ్డీ రేటు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ఈ క్రింది టేబుల్‌లో బ్యాంక్ ఎఫ్‌డీ, పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల‌తో పాటు బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మీరు పొందే అధిక రాబ‌డిని చూడ‌వ‌చ్చు.

అంతే కాకుండా ఇత‌ర సంస్థ‌లు అందించే వ‌డ్డీ రాబ‌డుల‌ను లెక్కించ‌డానికి మీరు బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ వెబ్‌సైట్‌లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలిక్యులేట‌ర్‌ను ఉప‌యోగించి చూడొచ్చు. మీరు పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందే వివిధ సంస్థ‌ల వ‌డ్డీ రాబ‌డుల‌ను అంచ‌నా వేయ‌డానికి మీకు ఎంత‌గానో ఈ కాలిక్యులేట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ ఆర్ధిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధ‌, వార్షిక చెల్లింపుల్లో వ‌డ్డీని స్వీక‌రించ‌డానికి కూడా ఇందులో ప‌థ‌కాలు ఉన్నాయి.

బ‌జాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎఫ్‌డీ మీద రుణం వంటి యాడ్‌-ఆన్‌ల‌ను అందిస్తుంది. మీ ఎఫ్‌డీ మొత్తంలో 75% వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. న‌గ‌దు ఉన్న‌ప్పుడు కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో మ‌ళ్లీ న‌గ‌దు జ‌మ చేయ‌వ‌చ్చు. ఇలా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీని  నిధుల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. 

బ‌జాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డితో, కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్ ప్ర‌క్రియ ద్వారా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మీరు ఇంటి నుండే కాంటాక్ట్‌లెస్ డిపాజిట్లు, ఎఫ్‌డీ స‌ర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మీకు త‌గిన ప్ర‌ణాళిక‌లు వేసుకోవ‌డానికి ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్ల కాలిక్యులేట‌ర్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. బ‌జాజ్ ఫైనాన్స్ `ఎఫ్ఏఏఏ` అత్య‌ధిక భ‌ద్ర‌తా రేటింగ్‌ల‌ను `క్రిసిల్‌` `ఎమ్ఏఏఏ ఇక్రా` చేత అందిస్తోంది. ఈ రేటింగ్‌లు భ‌ద్ర‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌ను సూచిస్తున్నందున‌.. మీ అస‌లు, వ‌డ్డీ రాబ‌డులు సుర‌క్షిత‌మైన చేతుల్లోనే ఉన్నాయ‌ని భావించ‌వ‌చ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని