బజాజ్‌ పల్సర్‌ 180 రిటర్న్స్ - bajaj launches new pulsar 180
close

Updated : 24/02/2021 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బజాజ్‌ పల్సర్‌ 180 రిటర్న్స్

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సరికొత్త పల్సర్‌ 180 బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలోని వెర్షన్‌కి మెరుగులు దిద్ది దీన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీని ధరను రూ.1,07,904గా నిర్ణయించారు. బోల్డ్‌ వీల్‌ డెకల్స్‌, హెడ్‌ల్యాంప్‌లో ట్విన్‌ పైలట్‌ ల్యాంప్‌లతో పాత మోడల్‌ కంటే భిన్నంగా కనిపిస్తోంది. స్పోర్టీ స్ప్లిట్‌ సీట్, బ్లాక్‌ అలాయ్‌ వీల్స్‌, ఇన్ఫినిటీ ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ బైక్‌కు అందాన్ని తీసుకొచ్చాయి. 

ఇంజిన్‌ విషయానికి వస్తే.. 178.6 సీసీ, ఫోర్‌ స్ట్రోక్‌, వాల్వ్‌ ఎయిర్‌ కూల్డ్‌, బీఎస్‌-6 డీటీఎస్‌-ఐ-ఫై ఇంజిన్‌ని పొందుపరిచారు. 8,500 ఆర్‌పీఎం వద్ద 12.52 కిలోవాట్‌ శక్తిని విడుదల చేస్తుంది. 6500 ఆర్‌పీఎం వద్ద 14.52 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి అవుతుంది. 5 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌ బ్యాక్స్‌ ఉంది. ముందు భాగంలో యాంటీ ఫ్రిక్షన్‌ బుష్‌ సస్పెన్షన్‌, వెనుక భాగంలో 5 వే అడ్జస్టబుల్‌ నిట్రాక్స్‌ షాక్‌ అబ్జార్బర్‌ కలదు. మార్కెట్లో స్పోర్ట్స్‌ ద్విచక్ర వాహన విభాగంలో 20 శాతం 180-200 సీసీ బైక్‌లే ఉన్నాయని బజాజ్‌ ఆటో ప్రతినిధులు తెలిపారు. ఈ సెగ్మెంట్‌లో మరింత స్టైలిష్‌, మెరుగైన పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని పల్సర్ 180ని కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

హ్యుందాయ్‌ కొత్త మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం

ఎన్నిసార్లైనా ఆగండి: డ్రైవర్‌తో సహా అద్దెకు బైక్‌!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని