వాట్సాప్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సేవలు! - bank of baroda launches whatsapp banking services
close

Updated : 04/01/2021 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాట్సాప్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సేవలు!

ముంబయి: మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొంటున్న బ్యాంకులు ప్రజలకు తమ సేవలను మరింత చేరువచేయడంలో పోటీ పడుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సర్వీసులను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవలందిస్తుండగా.. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌, చెక్‌ స్టేటస్‌ ఎంక్వైరీ, చెక్‌బుక్‌ రిక్వెస్ట్‌, డెబిట్‌ కార్డు బ్లాకింగ్‌.. ఇలా తమ సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులకు అందుబాటులో ఉంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరుగుతున్న వేళ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు వాట్సాప్‌ బ్యాంకింగ్‌ బాగా దోహదపడుతుందని తాము ఆశిస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏకే ఖురానా తెలిపారు. బ్యాంక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్‌లో (నెంబర్‌: 8433888777) 24×7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఖాతాదారులు కాకపోయినా వాట్సాప్‌ వేదికగా తమ బ్యాంకు సర్వీసులు, ఆఫర్లు, ఏటీఎం, బ్రాంచ్‌ల వివరాలను తెలుసుకొనే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి..

కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని