బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్‌! - bmw motorrad drives in new r 18 classic into indian market
close

Updated : 24/02/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహన రంగంలో బీఎండబ్ల్యూకు ఉన్న క్రేజే వేరు. కారైనా.. బైకైనా.. తనదైన ప్రత్యేకతతో వినియోగదారుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సంస్థ ద్విచక్రవాహన విభాగమైన బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ భారత విపణిలోకి మరో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 క్లాసిక్‌ పేరిట వచ్చిన ఈ కొత్త బైక్‌.. క్రూయిజర్‌ సెగ్మెంట్‌లో సంస్థ తీసుకొచ్చిన రెండో బైక్‌. ఇక దీని ధరను రూ.24 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. గతంలో తీసుకొచ్చిన ఆర్‌ 18కు మరిన్ని అధునాత ఫీచర్లు అద్ది దీన్ని అందుబాటులోకి తెచ్చారు. 

ఈ బైక్ 1802 సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ బాక్సర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఆరు గేర్లతో వస్తోంది. బైక్ ఇంజిన్‌ 3,000 ఆర్‌పీఎం వద్ద 157.57 ఎన్‌ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 2000-4000 ఆర్‌పీఎం వద్ద 135.58 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక 4,750 ఆర్‌పీఎం వద్ద 91 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అతిపెద్ద విండ్‌ స్క్రీన్‌, ప్యాసెంజర్‌ సీట్‌, స్యాడిల్‌ బ్యాగ్స్‌, ఎల్‌ఈడీ అదనపు హెడ్‌లైట్లు, 16-ఇంచ్‌ ఫ్రంట్‌ వీల్‌ దీనిలోకి ప్రత్యేక ఫీచర్లు. అలాగే, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ కంట్రోల్‌, కీలెస్ రైడ్‌ సిస్టం, ఎలక్ట్రానిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ అదనపు ఆకర్షణలు.

పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ (CBU) కింద ఈ బైక్‌లను భారత్‌కు దిగుమతి కానున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని.. బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ డీలర్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. 1930ల్లో బీఎండబ్ల్యూ ఆర్‌5 స్ఫూర్తితో సంస్థ ఈ క్రూయిజర్‌ బైక్‌లను తీసుకొచ్చింది. గుండ్రటి హెడ్ ల్యాంప్, పొడవాటి హ్యాండిల్ బార్స్, భారీ పొగ గొట్టంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఇవీ చదవండి..

6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా సఫారీ..ధర ఎంతంటే?

6.3 సెకన్లలో 100 కి.మీ వేగం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని