సెన్సెక్స్‌.. 50వేలకు చేరువలో.. - bse sensex jumps 393 pts to end at lifetime high of 49792
close

Published : 20/01/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్‌.. 50వేలకు చేరువలో..

ముంబయి: వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి. కొనుగోళ్ల అండతో కొత్త రికార్డులను నెలకొల్పాయి. అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు కాబోయే ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ యెల్లెన్‌ ప్రకటనతో ఆసియా మార్కెట్లు రికార్డు స్థాయిల గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇది దేశీయ సూచీలకు కూడా కలిసొచ్చింది. దీనికి తోడు ఐటీ, ఫార్మా రంగాలలో వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలను మరింత ముందుకు నడిపించాయి. దీంతో నేడు సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు ఎగబాకి 50వేల మైలురాయికి చేరువగా.. నిఫ్టీ 14,600 పైన స్టిరపడింది. 

ఈ ఉదయం 170 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ తర్వాత కాసేపు ఒడుదొడుకులకు లోనైంది. అయితే మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల అండతో అంతకంతకూ జోరు పెంచిన సూచీ చివరకు 393.83 పాయింట్లు లాభపడి 49,792.12 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 123.50 పాయింట్లు దూసుకెళ్లి 14,644.70 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.02 వద్ద ముగిసింది. 

నిఫ్టీలో టాటా మోటార్స్‌, అదానీపోర్ట్స్‌, విప్రో, టెక్‌మహీంద్రా, మారుతి సుజుకీ షేర్లు రాణించాయి. పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌, శ్రీ సిమెంట్స్‌, ఎన్‌టీపీసీ, గెయిల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దాదాపు 2శాతం మేర పెరిగాయి. 

ఇవీ చదవండి..

‘పల్లెదారి’ పట్టండి..!

వృద్ధులకు పన్నుపోటు తప్పేనా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని