వీటిపై సుంకాలు పెరగవచ్చు..! - budget seen raising import duties by dozens of items: report
close

Updated : 19/01/2021 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీటిపై సుంకాలు పెరగవచ్చు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ సారి ప్రభుత్వం కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 5 నుంచి 10శాతం వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు జాబితాలో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలు వంటి దాదాపు 50 రకాల వస్తువులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీటిపై చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. 

ఆత్మనిర్భర్ భారత్‌ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకొంటున్నారు. దీంతో దిగుమతులు తగ్గి.. దేశీయంగా తయారీ బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఈ చర్యలతో మరో రూ.20,000 కోట్ల వరకు ఆదాయాన్ని పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ పెంపు ముఖ్యంగా ఫర్నిచర్‌, విద్యుత్తు వాహన సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే భారత్‌లో విస్తరిస్తున్న ఐకియా, టెస్లా మోటార్స్‌ వంటి వాటిపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. భారత్‌లో ఇప్పటికే ఉన్న పన్ను వ్యవస్థలపై ఈ రెండు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

ఈ జాబితాలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు 

రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణలపై కూడా భారీగా సుంకాలను వడ్డించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1 బడ్జెట్‌ నాటికి ఈ ప్రతిపాదనల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. ఇప్పటికే భారత్‌ విదేశీ కంపెనీలపై వివక్ష చూపుతోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో భారత్‌ వరుసగా దేశీయ కంపెనీలను కాపాడేలా చర్యలు తీసుకోవడం ఇందుకు కారణం. తాజా ప్రతిపాదనలపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే మాత్రం ఇవి తప్పదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. గత ఏడాది కూడా చాలా వస్తువులపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచింది. వీటిల్లో ఫుట్‌వేర్‌, ఫర్నిచర్‌, బొమ్మలు, విద్యుత్తు పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌లపై దాదాపు 20 శాతం వరకు పెంచింది.

ఇవీ చదవండి

ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!

ఆర్థిక మంత్రికి అండదండలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని