కార్లలో వైరస్‌లను నిరోధించే సాంకేతికత! - cabin air purification tech to inhibit viruses succesful in labs says jlr
close

Published : 16/03/2021 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్లలో వైరస్‌లను నిరోధించే సాంకేతికత!

సత్ఫలితాలిస్తోన్నట్లు ప్రకటించిన జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌

దిల్లీ: కార్లలోకి ఎలాంటి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఆపగలిగే సాంకేతికతకు టాటా గ్రూప్‌నకు చెందిన జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అభివృద్ధి చేస్తోంది. ‘క్యాబిన్‌ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సాంకేతికత’గా పేర్కొంటున్న ఈ కొత్త టెక్నాలజీ లేబొరేటరీ ప్రయోగాల్లో సత్ఫలితాలిచ్చినట్లు జేఎల్‌ఆర్‌ ప్రకటించింది. వైరస్‌లు, గాలి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాలను 97 శాతం నిరోధించగలిగినట్లు తెలిపింది. 

పానాసోనిక్‌ కంపెనీకి చెందిన సాంకేతికతతో తయారు చేసిన హీటింగ్‌, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) వ్యవస్థ.. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థంగా అడ్డుకుందని జేఎల్‌ఆర్‌ తెలిపింది. ఈ కొత్త సాంకేతికతతో రానున్న భవిష్యత్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ మోడల్‌ కార్ల క్యాబిన్లు వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ఈ సాంకేతికత అభివృద్ధి కోసం ప్రముఖ బయోటెక్నాలజీ, వైరాలజీ ల్యాబ్‌ అయిన పర్ఫెక్టస్‌ బయోమెడ్ లిమిటెడ్‌తో జతకలిసినట్లు వెల్లడించింది. హానికరమైన క్రిముల్ని తొలగించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పలు మోడళ్లలో జేఎల్‌ఆర్‌ 2.5 పీఎం పరిమాణం వరకు ఉండే కణాలను అడ్డుకోలగలిగే నానో టెక్నాలజీని అందిస్తోంది.

ఇవీ చదవండి..

కియా విద్యుత్తు కారు ఈవీ6

జాగ్వార్‌ నుంచి అన్నీ విద్యుత్‌కార్లే


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని