టార్గెట్‌ రూ.19 లక్షల కోట్లు..? - centre likely to hike farm credit target to about
close

Updated : 30/01/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టార్గెట్‌ రూ.19 లక్షల కోట్లు..?

సరికొత్త వ్యవసాయ రుణ లక్ష్యంపై కసరత్తు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం ఎదుట 2021-22 బడ్జెట్‌ పెను సవాళ్లను ఉంచుతోంది.  రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం దీనిలో ఒకటి. గతంలోనే 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇచ్చే పంటరుణాల లక్ష్యాన్ని కూడా గణనీయంగా పెంచనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15 లక్షల కోట్లను రుణ లక్ష్యాలుగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఈ లక్ష్యాలను పెంచుకుంటూ వస్తోంది. 2017-18లో రూ.10 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.11.68లక్షల కోట్ల మేరకు రుణాలు పంపిణీ చేశారు.  అంతకు ముందు సంవత్సరం కూడా లక్ష్యాన్ని మించి రుణాలు పంపిణీ చేశారు.  దీంతోపాటు ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార సంఘాలు కూడా వ్యవసాయ రుణాల విషయంలో చురుగ్గా ఉన్నాయి. మరోపక్క నాబార్డ్‌ కూడా క్రెడిట్‌ రీఫైనాన్స్‌ స్కీంను మరింత పొడిగించింది.  అయినా కానీ కరోనా సమయం కావడంతో ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉంది.. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు వ్యవసాయ రుణాలను సాధారణంగా పెంచేకన్నా మరింత ఎక్కువ చేయనుంది.

వ్యవసాయ రుణాలపై 9శాతం వడ్డీ వసూలు చేస్తారు. కానీ ప్రభుత్వం రూ.3లక్షల వరకు రుణాలకు 2శాతం పన్ను రాయితీ ఇస్తోంది. ఇక 7 శాతం వడ్డీ చెల్లించాలి. దీనిలో సకాలంలో రుణ చెల్లింపులు చేసినవారికి 3శాతం రాయితీ లభిస్తుంది. దీంతో వ్యవసాయదారుడు 4శాతం వడ్డీ మాత్రమేచెల్లించాలి. దీంతో ఎక్కువ మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకొంటున్నారు. గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను కూడా ఆశ్రయించేవారు. ఆ సమయంలో ప్రభుత్వం రుణాల మంజూరును సులభతరం చేసింది. రైతులకు రుణాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ పంటల విస్తీర్ణం పెరిగి దిగుబడులు పెరిగాయి. 

ఇవీ చదవండి

కొంచెం చూసి పన్నేయండి..!
కొంచెం చూసి పన్నేయండి..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని