పన్ను రూపంలో కరోనా కాటు..! - centre may introduce covid 19 cess heres what you should know
close

Published : 25/01/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్ను రూపంలో కరోనా కాటు..!

 బడ్జెట్‌లో కసరత్తు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఈసారి బడ్జెట్‌ను కరోనా వైరస్‌ కమ్మేసిందనే చెప్పాలి. బడ్జెట్‌ కాపీల ప్రింటింగ్‌ నుంచి పన్ను ప్రతిపాదనల వరకూ ప్రతి అంశాన్ని ఇది ప్రభావితం చేసింది. ఇప్పటికే వ్యాపారాలు మందకొడిగా ఉండటంతో కొత్త పన్నులు జోడించడం గానీ, పెంచడం గానీ చేయవద్దని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నాయి. మరోపక్క ప్రభుత్వం మాత్రం కొత్తగా కరోనా సెస్సు విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వీటిల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం భారీగా నిధులను కేటాయించాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆదాయాలను వీలైనంత పెంచుకొనే మార్గాలను వెతుకుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ఓ విడత చర్చించినట్లు తెలిసింది. ఈ అంశంపై తుది నిర్ణయం ఫిబ్రవరి1న ప్రకటించనున్నారు. మరోపక్క ఈ అంశాన్ని  ఆర్థిక నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కొత్త పన్నులు విధించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. టీకా పంపిణీ నిమిత్తం ఈ ఏడాది ప్రభుత్వానికి సుమారు రూ.65,000 కోట్ల వరకు వెచ్చించాల్సి రావచ్చు.  ఇందుకోసం వైద్య సిబ్బంది శిక్షణ, రవాణ సౌకర్యాలు, పంపిణీ, నిల్వ వ్యయాలు మొత్తం కేంద్రం భరించే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై, గ్రామీణ ప్రాంతాలపై అదనంగా నిధులను వెచ్చించాల్సి రావచ్చు. దీంతో కేంద్రం ఓ  కొత్త సెస్సు విధించి నిధులు సమీకరించాలని భావిస్తోంది. 

సెస్సు ఎలా ఉండే అవకాశం ఉంది..?

కరోనా సెస్సు ఎలా విధించాలనే అంశంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. దీనికి సంబంధించి మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. అత్యధిక ఆదాయ వర్గంపై స్వల్ప స్థాయిలో సెస్సు విధించాలని లేదా ఇంధనంపై విధించే సెస్సుల్లో దీనిని జోడించాలని భావించారు. దీంతోపాటు అత్యంత విలువైన వస్తువులపై కూడా దీనిని విధించాలనే సూచనలు వచ్చాయి. కాకపోతే కేంద్రం ఏకపక్షంగా ఈ సెస్సును విధించే అవకాశం లేదు. జీఎస్‌టీ కౌన్సిల్‌ కూడా దీనికి ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. పన్నులతో పోలిస్తే సెస్సులు వేగంగా నిధులను సమకూర్చనుండటంతో ప్రభుత్వం దీనికి మొగ్గు చూపుతోంది. ఎందుకంటే కేంద్ర సెస్సుల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు.

రాష్ట్రాలు ఇప్పటికే సెస్సుల బాట..

మరోపక్క చాలా రాష్ట్రాలు ఇప్పటికే వేర్వేరు రూపాల్లో తాము విధించే పన్నులపై సెస్సులను విధిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా జీఎస్‌టీలో వాటా తగ్గడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. ఝార్ఖండ్‌ ఇప్పటికే ఖనిజాలపై కొవిడ్‌ సెస్‌ విధించింది. పంజాబ్‌లో మద్యంపై 70శాతం కరోనా కరోనా సెస్‌ విధించారు. జూన్‌లో దీనిని నిలిపివేసినా.. వ్యాట్‌ను మాత్రం పెంచారు.

ఇవీ చదవండి

మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాల బాదుడు

ఎన్‌పీఏల సమస్యకు ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ పరిష్కారమా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని