వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు అందించే వ్య‌క్తిగ‌త రుణాల వివ‌రాలు. - checkpoints-to-clear-before-availing-a-personal-loan
close

Updated : 15/02/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు అందించే వ్య‌క్తిగ‌త రుణాల వివ‌రాలు.

వివిధ బ్యాంకులు వ్య‌క్తుల వారి ఆర్థిక సామ‌ర్ద్యాన్ని బ‌ట్టి వ్య‌క్తిగ‌త రుణాలను అందిస్తున్నాయి.

ఈ రుణాల‌ను వేగంగా పొంద‌డానికి మంచి క్రెడిట్ స్కోర్ క‌లిగి ఉండ‌టం ముఖ్యం. సాధార‌ణంగా క్రెడిట్ స్కోర్ 750 మ‌రియు ఇంత‌కంటే ఎక్కువ ఉన్న ధ‌ర‌ఖాస్తుదారులు రుణ అనుమ‌తి పొందే అవ‌కాశాలు ఎక్కువ‌. మంచి క్రెడిట్ స్కోర్ సంపాదించ‌డానికి రుణ వాయిదాలు (ఈఎంఐ)లు మ‌రియు క్రెడిట్ కార్డ్ బిల్లుల‌ను స‌కాలంలో తిరిగి చెల్లించ‌డం, 30% లోపు క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని క‌లిగి ఉండ‌టం, ఎవ‌రికైన రుణ గ్యారంటీగా ఉన్న‌ప్పుడు వారితో ఆ రుణాల‌ను స‌రైన టైమ్‌లో క‌ట్టేలా చేయ‌డం, వాటిని ప‌ర్య‌వేక్షించ‌డం చాలా అవ‌స‌రం.

అంతేగాక వ్య‌క్తిగ‌త రుణాల‌ను ధ‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు తక్కువ వ్య‌వ‌ధిలో ఎక్కువ సార్లు, ఎక్కువ సంస్థ‌ల‌కు క్రెడిట్ ఎంక్వైరీలు చేస్తే మిమ్మ‌ల్ని క్రెడిట్ కోసం ప‌రిత‌పిస్తున్న రుణగ్ర‌హీత‌గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. దీని ఫ‌లితంగా రుణం ఇచ్చేవారు మీ వ్య‌క్తిగ‌త రుణ దర‌ఖాస్తును తిర‌స్క‌రించ‌వ‌చ్చు. మ‌రియు త‌ర‌చూ ఉద్యోగాల‌ను మారేవారికి రుణం పొందే అవ‌కాశం త‌క్కువుగా ఉంటుంది.

వివిధ బ్యాంకుల వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ వాయిదాలు ఒకేలా ఉండ‌వు. వేర్వేరుగా ఉంటాయి. కొన్ని ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల వివ‌రాలు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి.

ఈ రేట్లు మ‌రియు ఛార్జీలు 14 జ‌న‌వ‌రి, 2021 తేది నాటివి.
 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని