‘ప్రైవేటీకరణ లేదా మూసివేత.. రెండే మార్గాలు’ - choice between disinvestment and closing down minister on air india
close

Updated : 27/03/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రైవేటీకరణ లేదా మూసివేత.. రెండే మార్గాలు’

ఎయిరిండియాపై హర్దీప్‌ పురి కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని ప్రైవేటీకరించడం? లేదా పూర్తిగా మూసివేయడం?తప్ప వేరే మార్గమే లేదన్నారు. ప్రైవేటీకరించడమా?లేక ప్రైవేటీకరించకపోవడమా?అన్న ప్రత్యామ్నాయాలు కేంద్ర ప్రభుత్వం ముందు లేనేలేవన్నారు. ఎయిరిండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందన్నారు. ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర రుణాలు పేరుకుపోయాయన్నారు. కొత్త యాజమాన్యం రాక తప్పదని స్పష్టం చేశారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని, ఇదంతా మే ఆఖరుకు పూర్తికావచ్చని హర్దీప్‌ సింగ్‌ శుక్రవారం ఓ సందర్భంలో తెలిపారు. ఆ తర్వాతే ఎయిరిండియాను ఎవరికి అప్పగించాలి అనేది తెలుస్తుందని అన్నారు. మరోవైపు ఎయిరిండియా కోసం ఆల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో కలిసి స్పైస్‌జెట్‌ యజమాని అజయ్‌సింగ్‌, దిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ అంకుర్‌ భాటియా, టాటా సన్స్‌ బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని