ఆరోగ్య బీమాలో క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ కార‌ణాలు - comprehensive-details-of-Health-Insurance
close

Updated : 24/04/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమాలో క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ కార‌ణాలు

పాలసీ తీసుకునే సమయంలోనే ఈ అంశాల గురుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ కార‌ణాలు:
ఈ కింది సందర్భాలలో పాలసీ క్లెయిమ్ పూర్తిగా గానీ , కొత్త మొత్తం గానీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. బీమా కంపెనీ వారు అడిగిన అన్ని పత్రాలను సమర్పించక పోయినా, పరిమితికి మించి క్లెయిమ్ చేసినా , పాలసీలో చెప్పినట్లు కో-పేమెంట్ (సహా- చెల్లింపులు), ఉప పరిమితులు (సబ్-లిమిట్స్ ), చెల్లంచలేని వస్తు సేవలకు క్లెయిమ్ చేసినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది . అందువలన పాలసీ తీసుకునే సమయంలోనే ఈ అంశాల గురుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

చికిత్స‌కు చెల్లింపులు:
సాధారణంగా బీమా కంపెనీలు పాలసీదారులకు థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ర్టేట‌ర్ (టిపీఏ) ల ద్వారా న‌గ‌దు ర‌హిత‌ సౌకర్యం కల్పిస్తుంటాయి. అంటే పాలసీదారుడు నగదు లేకుండా చికిత్స పొందవచ్చు.

అయితే బీమా కంపెనీ వారు ఒప్పందం కుదుర్చుకున్న నెట్‌వ‌ర్క్ ఆసుపత్రులలో మాత్రమే ఈ సౌకర్యం పొందవచ్చు. పాలసీ పరిమితులకు లోబడి టిపీఏలు సేవ‌లు అందిస్తాయి. అయితే , పాలసీలో తెలిపిన చెల్లింపు చేయని సేవలకు పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏదేని కారణాల వలన పాలసీ దారుడు నెట్ వర్క్ కాని ఆసుపత్రిలో చికిత్స పొందితే , బీమా కంపెనీకి రాత పూర్వకంగా తెలియచేయాలి. చికిత్స పూర్తైన తరువాత ఖర్చులను ఆసుపత్రి వారికి చెల్లించి, తరువాత అన్ని పత్రాలను బీమా కంపెనీకి సమర్పించాలి. పాలసీ పరిమితులకు లోబడి క్లెయిమ్ సొమ్మును బీమా కంపెనీ పాలసీదారునికి చెల్లిస్తుంది.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం వ్య‌క్తిగ‌త లేదా గ్రూప్ పాల‌సీ:
మీకు బృంద ఆరోగ్య బీమా పాలసీ తోపాటు మీ సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉంటె, ముందుగా బృంద ఆరోగ్య బీమాను వినియోగించుకోవడం మంచిది. ఆ తరువాత అవసరమైతే మీ సొంత పాలసీని వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ పరంగా ఈ రెండింటికి పెద్దగా తేడా ఉండదు.

త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ క‌వ‌రేజ్:
ఒక బేసిక్ ఆరోగ్య బీమాను రూ 2-3 లక్షలకు తీసుకుని , టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ పాలసీని మీ అవసరానికి అనుగుణంగా అధిక మొత్తానికి తీసుకోవచ్చు. టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో ఎక్కువ హామీ మొత్తాన్ని పొందవచ్చు. టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ను మరేదైనా బీమా కంపెనీ నుంచి కూడా పొందవచ్చు. అయితే మీ బేసిక్ కవరేజ్ వివరాలను ఇవ్వవలసి ఉంటుంది.

వేరే పాల‌సీలు ఉన్నా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ:
ఎవరికైనా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ ఉంటే, వారిని ఫామిలీ ఫ్లోటర్ పాలసీలో కూడా సభ్యునిగా చేర్చవచ్చు. అయితే, రెండింటిలో ఉండటం వలన ప్రీమియం పెరుగుతున్నట్టయితే, వీలు ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని