మహీంద్రా బంపర్‌ ఆఫర్‌..! - discounts of up to 3.06 lakh on bs6 mahindra cars
close

Published : 17/01/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహీంద్రా బంపర్‌ ఆఫర్‌..!

 అత్యధికంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. బీఎస్‌6 మోడల్‌ కార్లపై అత్యధికంగా రూ.3.06లక్షల వరకు ఇవ్వనుంది. ఆల్‌న్యూ థార్‌ కాకుండా మిగిలిన వాటిపై ఇది వర్తించనుంది. వీటిల్లో క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇతర ఆఫర్లు కూడా వీటిలోనే కలిసి ఉంటాయి. జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు లభిస్తాయి. 
మహీంద్రా ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ఆల్టురస్‌ జీ4 మోడల్‌పై అత్యధికంగా రూ.2.20లక్షల క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.50 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.16వేలు, ఇతర లబ్ధిలు రూ.20 వేల వరకు లభిస్తాయి. 
స్కార్పియోపై రూ.39,502 వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. వీటిల్లో రూ.10,002 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.15,000 ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, రూ.4,500 కార్పొరేట్‌ డిస్కౌంట్‌, అదనపు ఆఫర్ల కింద మరో రూ.10వేలు ఇవ్వనున్నారు. కేయూవీ 100 నెక్స్ట్‌పై రూ.62,055 తగ్గింపు వర్తిస్తుంది. ఎక్స్‌యూవీ 500పై రూ.59వేల లబ్ధిపొందవచ్చు.  ది మర్రాజో ఎంపీవీపై రూ.36వేలు, బొలేరోపై రూ.24వేల తగ్గింపులు వర్తిస్తాయి. 

ఇవీ చదవండి

ఏవీ ఈవీ పరుగులు

భూలోక కుబేరుడు.. కారు రిపేరుకు డబ్బులు లేవట!


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని