నీకు వాటా కావాలా..? సిద్ధంగా ఉండు..! - divestment continues but little progress on privatisation
close

Updated : 30/01/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీకు వాటా కావాలా..? సిద్ధంగా ఉండు..!

 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం 

ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌... ఇలా ప్రతి బడ్జెట్‌లో ఏదో ఒక దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలో వాటాల విక్రయం ప్రణాళిక ఉండటం  ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడల్లా ఈ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చేపడుతుంది. ఏది ఏమైనా నాణ్యమైన సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు లభిస్తుంటుంది. ఈ సంస్థలకు ప్రభుత్వం అండదండలు ఉండటం.. కీలకమైన ప్రాజెక్టులు చేతిలో ఉండంతో ప్రజలు బలంగా వీటిని విశ్వసిస్తారు. దీనికి ప్రభుత్వం కూడా ఏటా పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని పెంచుకొంటూ పోతోంది. ప్రస్తుత సంవత్సరంలో అత్యధికంగా రూ.2.1లక్షల కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకొంది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలు ప్రజలకు, ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు లేదా ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలకు విక్రయించాలి. 

ముందుకు కదలని ప్రణాళిక

గతేడాది ప్రభుత్వం నిర్దేశించుకొన్న ప్రణాళిక నవంబర్‌ వరకు ఏమాత్రం ముందకు సాగలేదు. నవంబర్‌ నాటికి రూ.2.1 లక్షల కోట్ల లక్ష్యంలో  కేవలం రూ.6,179 కోట్లు మాత్రమే పెట్టుబడులు  ఉపసంహరణ నుంచి ప్రభుత్వానికి వచ్చాయి. మొత్తం లక్ష్యంలో ఇది కేవలం 3 శాతం మాత్రమే. కొవిడ్‌ లాక్‌డౌన్‌ ఇతర ప్రభావాలతో మార్కెట్లోకి వెళ్లేందుకు ప్రభుత్వం వెనుకాడింది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో  మార్కెట్లు బుల్లెట్‌ వేగంతో దూసుకుపోతున్నా ప్రభుత్వం ముందడుగు వేయలేదు. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌, భారత్‌ డైనమిక్స్‌, మాజేగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌, ఐఆర్‌సీటీసీ,ఆర్‌ఐటీఈఎస్‌ వంటి కంపెనీల్లో వాటాలు విక్రయించారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులైలో మాట్లాడుతూ మొత్తం 23 కంపెనీల్లో వాటాల విక్రయానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఎల్‌ఐసీ పెట్టుబడుల ఉపసంహరణ జాప్యం..

2020-21లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన  డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రాజెక్టు ఎల్‌ఐసీలో పెట్టుబడుల  ఉపసంహరణ. వాస్తవానికి ఎల్ఐసీని ఇందుకు సిద్ధం చేయాల్సి ఉంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా కుంగింది. అదే సమయంలో ప్రభుత్వ పన్నుల ఆదాయం కూడా 12.6శాతం పడిపోయింది. అక్కడికి ఇంధనంపై ఎక్సైజ్‌ డ్యూటీలు పెంచడంతో  ఈ మాత్రమైన ఆదాయం వచ్చింది. కేవలం ఎక్సైజ్‌ డ్యూటీల  నుంచే రూ.1.96 లక్షల కోట్లు వచ్చాయి. లేకపోతే మొత్తం పన్నులోటు 20శాతానికి చేరేది. ఈ సారి పన్ను ఆదాయం కొంత కోలుకోని పెరగవచ్చు.. కానీ, ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులను సమకూర్చే స్థాయిలో రావు. ఎందుకంటే పన్ను పెంపును కూడా వ్యవస్థ తట్టుకోలేని స్థితిలో  ఉంది. 

అమ్మక తప్పని పరిస్థితి..

ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ విఫలమైతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో వీలైనంత త్వరగా పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టవచ్చు. మార్కెట్లు కూడా అద్భుతమైన ఊపులో ఉన్నాయి. వచ్చే ఏడాది చివరి దాకా బుల్‌ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పలేము. ఒక వేళ మార్కెట్లు పడిపోతే ప్రభుత్వ రంగసంస్థల వాటాల విక్రయం కష్టమవుతుంది.  నిధుల సమీకరణకు ప్రభుత్వం అత్యంత వినూత్నమైన విధానాలను కూడా అనుసరించవచ్చు. చాలా ప్రభుత్వ రంగ ఏజెన్సీల వద్ద మెట్రోనగరాల్లో భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ సారి ఐఆర్‌సీటీసీలో మరింత వాటాను ప్రభుత్వం విక్రయించవచ్చు. దీంతోపాటు బీపీసీఎల్‌ కూడా ఉంది.  హిందూస్థాన్‌ ప్రిఫాబ్‌:ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌ అండ్‌  కంప్రెసర్స్‌, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, హిందూస్థాన్‌ ఫ్లోరోకార్బన్‌, భారత్‌ ఎర్త్‌మూవర్స్‌, పవన్‌ హన్స్‌, ఎయిర్‌ ఇండియా దాని ఐదు సబ్సిడిరీలు  ఉన్నాయి. 

ఇదీ చదవండి

పన్ను రూపంలో కరోనా కాటు..!
ప్రపంచమంతా ఓవైపు.. భారత్‌, చైనా మరోవైపు

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని