తిరిగి స‌మ‌కూర్చడం మరవద్దు..  - do-not-forget-to-rebalance-your-emergency-fund
close

Updated : 04/02/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరిగి స‌మ‌కూర్చడం మరవద్దు.. 

కోవిడ్-19 వ్యాప్తి మనందరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలందరూ ఆర్థికంగా నష్టపోయారు. మునుపెన్నడూ చూడని విధంగా లాక్డౌన్ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో  ఆదాయం తగ్గింది, ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరిగాయి.  ఈ పరిస్థితులు అత్యవసరనిధి అవసరాన్ని తెలియజేశాయి. కష్టసమయంలో అందే కొద్దిపాటి ఆర్థికసాయం ఆపద నుంచి గట్టేకేందుకు తోడ్పడంతోపాటు మానసిక ప్రశాంతతను కూడా చేకూరుస్తుంది. 

అత్యవసర నిధి అంటే ఏమిటి?

అత్యవసర లేదా ఆకస్మిక నిధి, పేరుకు తగినట్లుగానే సంక్షోభాలు లేదా ఊహించని పరిస్థితుల ప్ర‌భావం ఆదాయంపై ప‌డిన‌ప్పుడు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అనుకోని వైద్య ఖ‌ర్చులు, త‌ప్పనిస‌రి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాది కోల్పోవ‌డం, యుద్ధాలు, క‌రోనా వైర‌స్ వంటి సామాజిక కారాణాల వ‌ల్ల ఆదాయం త‌గ్గ‌డం మొద‌లైన కార‌ణాల‌తో అప్పులు చేయ‌కుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ర‌క్షిస్తుంది. 

అత్య‌వ‌స‌ర నిధికి ఉన్న‌ ప్రాధాన్య‌త వ‌ల్ల చాలా మంది దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. నిధిని ఏర్పాటు చేసుకున్నాం.. ఖ‌ర్చు పెట్టేసాం అని కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు పునఃస‌మీక్షించుకుంటూ ఉండాలి. క‌నీసం ఏడాదికి ఒక‌సారైనా చేస్తే మంచిద‌ని స్క్రిప్‌బాక్స్ స‌హా-వ్య‌వ‌స్థాప‌కుడు, ఛీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ ప్ర‌తీక్ మెహ‌తా తెలిపారు. 

ఎక్క‌డ దాచాలి?

సాధారణంగా అవసరానికి అందుబాటులో వుంటుంది అని డబ్బు ఇంట్లో ఉంచుకోవడమో లేదా బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేయడమో చేస్తుంటాం. కానీ డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. అందుకే ఈ నిధిలో కొంత మొత్తం అంటే పది వేల వరకు నగదు రూపంలో ఇంటిలో అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకు ఏటీఎం కి వెళ్లి డబ్బు తెచ్చే అవకాశం లేని సందర్భాలలో ఉపయోగపడుతుంది.  మిగిలిన మొత్తాన్ని పొదుపు ఖాతా లేదా అల్ట్రా-షార్ట్-టర్మ్ ఫండ్లలో ఉంచ‌వ‌చ్చు. త‌ద్వారా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎటువంటి ఆల‌స్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేంద‌కు వీలుంటుంది. విత్‌డ్రా స‌మ‌యంలో ఎటువంటి పెనాల్టీలు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి. లేదంటే రాబ‌డి త‌గ్గిపోయే అవ‌కాశం ఉంటుంది. 

పునఃస‌మీక్ష చేస్తున్న‌ప్పుడు ఇవి గుర్తించుకోండి:

1. ఆక‌స్మిక మార్పులకు అవ‌కాశం ఉండాలి..                                                                                                                                                                                                  సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటాయి. కాబట్టి 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్నిఅత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇవి అందిరికి ఒకేలా ఉండ‌వు. ఉద్యోగం ప్రారంభ‌మైన తొలినాళ్ళ‌లో అంటే 20ల వ‌య‌సులో ఉన్న‌వారు 6 నెల‌ల కాలానికి స‌రిపోయే నిధిని ఏర్పాటు చేసుకుంటే స‌రిపోతుంది. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది ఖ‌ర్చులు, భాద్య‌త‌లు పెరుగుతాయి కాబ‌ట్టి ద‌శ‌ల వారిగా 12 నెల‌ల వ‌ర‌కు స‌రిపోయే నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం మంచిది.

2. బీమా క‌వ‌ర‌వుతుంటే.. ఎక్కువ పెట్ట‌ద్దు..
అత్య‌వ‌స‌ర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న‌ చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మత్తు ఖర్చులు  వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఆరోగ్యం, మోటారు వంటి వాటికి బీమా ఉంటుంది.  అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను బీమా ద్వారా పొందే అవ‌కాశం ఉన్న‌ప్పుడు, అత్య‌వ‌స‌ర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఉండ‌దు. స‌మీక్ష స‌మ‌యంలో వీటిని దృష్టిలో ఉంచుకోండి. 

3. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి..
ఖ‌ర్చుల‌ను పునఃస‌మీక్షించాలి. సాధార‌ణంగా చేసే నెల‌వారీ ఖ‌ర్చుల నుంచి యుటిలిటీ, కిరాణా బిల్లల‌ను కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. బ్రాండ్‌, వినోదం, విహార యాత్రాలు, అవ‌స‌రం లేని ప్ర‌యాణాలు వంటి వాటిని త‌గ్గించుకోవాలి. ఒక నిర్ధిష్ట జీవిన‌శైలికి అల‌వాటు ప‌డిన వారు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డం సుల‌భం కాదు. అయిన‌ప్ప‌టికీ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో ఈ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి. అత్య‌వ‌స‌ర నిధిని స‌మ‌కూర్చుకునేప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని