డుకాటీ నుంచి ఈ ఏడాది 12 మోడళ్లు - ducati says will come out with 12 new bsvi-compliant motorcycles this year
close

Published : 06/01/2021 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డుకాటీ నుంచి ఈ ఏడాది 12 మోడళ్లు

ముంబయి: దేశీయంగా తమ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించేందుకు ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ సిద్ధమైంది. ఈ ఏడాదిలో కొత్తగా 12 మోటార్‌ సైకిళ్లను తీసుకురానుంది. ఇవన్నీ బీఎస్‌-6 ప్రమాణాలతోనే రాబోతున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మల్టీస్ట్రడా వీ4, స్ట్రీట్‌ ఫైటర్‌ వీ4, మాన్‌స్టర్‌, సూపర్‌ స్పోర్ట్‌ 950, స్క్రాంబ్లర్‌ నైట్‌షిప్ట్‌ వంటి మోడళ్లు ఉన్నాయి.

కరోనా కారణంగా 2020లో వ్యాపారమంతా తుడిచిపెట్టుకుపోయిందని డుకాటీ ఇండియా ఎండీ బిపుల్‌ చంద్ర అన్నారు. దీంతో గతేడాది తీసుకురావాలనుకున్న వాహన ప్రణాళికలన్నీ వాయిదా పడ్డాయన్నారు. దీంతో 2021లో బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన 12 మోటార్‌ సైకిళ్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి  స్క్రాంబ్లర్‌ ఐకాన్‌, స్క్రాంబ్లర్‌ డార్క్‌ మోడళ్లకు బుకింగ్స్‌ మొదలు పెట్టామని చెప్పారు. వీటిని రూ.50వేలు డౌన్‌ పేమెంట్‌తో బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి త్రైమాసికంలో కొత్త బైక్‌ల విడుదల ఉండేట్లు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

ఇవీ చదవండి..
హోండా ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీవిరమణ..!
అత్యధిక స్థాయికి చేరుకుంటున్న పెట్రోల్ ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని