ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు వ్యాపారావకాశాలను అందిపుచ్చుకొనేలా ప్రేరణ కల్పించేందుకు ఐఐటీ హైదరాబాద్ ఈ-సెల్ ‘ఈ సమ్మిట్ 2021-ఏ ప్రాగ్మాటిక్ అడ్వెంట్’ను నిర్వహిస్తోంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు ఈ ఏడాది జనవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ఆన్లైన్ వేదికగా జరుగుతోంది. చిన్న వయసులోనే అంకుర సంస్థలను స్థాపించేలా యువతకు ప్రేరణ కల్పిస్తారు. ఇందులో భాగంగా నిపుణులతో ఉపన్యాసాలు, బృంద చర్చలు, పోటీలు, నెట్వర్క్ ఈవెంట్లను ఏర్పాటు చేశారు. కొవిడ్-19 మహమ్మారి వ్యాపారాలను దెబ్బకొట్టిన నేపథ్యంలో విద్యార్థులు, యువ వ్యాపారవేత్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించనున్నారు.
పవర్ నింపే టాక్స్
ఆయా రంగాల్లో నిష్ణాతులైన కొందరు నిపుణులను ఎంపిక చేసి పవర్ టాక్ సెషన్లు (ఉపన్యాసాలు) ఇప్పించనున్నారు. అనుభవజ్ఞులతో ప్రత్యేక అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ (బృంద చర్చలు) ఉండనున్నాయి. ఇవన్నీ తరగతి గదిలో బోధిస్తున్నట్టుగా కాకుండా చర్చించుకుంటున్నట్టు ఉంటాయి. ఇక వినోదంగా ఉండనున్నాయి. టెస్లా మోటార్స్ మాజీ సీఐవో, టెకియాన్ సీఈవో జే విజయన్, శామ్సంగ్ ఆర్అండ్డీ ఇన్స్టిట్యూట్ ఇండియా సీటీవో అలోక్ నాథ్, 40+ ఉపన్యాసకులు ఈ-సమ్మిట్ 21కు హాజరవుతుండటం విశేషం.
రూ.5లక్షలు గెలిచే అవకాశం
ఈ-సమ్మిట్లో పాల్గొంటున్న యువకులు, విద్యార్థులకు ఆసక్తికర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ-పిక్ (ఎలివేటర్ పిచ్), బిజినెస్ క్విజ్, పిచ్ షోడౌన్, కేస్ స్టడీస్, ది బ్రీఫ్కేస్ వంటి పోటీలు ఉంటాయి. ఒకరు నుంచి ముగ్గురు బృంద సభ్యులుగా ఉండే పోటీల్లో రూ.5లక్షల విలువైన బహుమతులు గెలుచుకోవచ్చు.
నెట్వర్కింగ్ ఈవెంట్లు
అంకుర సంస్థలు నెలకొల్పాలనుకొనే ఆశావహుల కోసం నెట్వర్కింగ్ ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రోత్సాహకులు, పెట్టుబడిదారులుతో మాట్లాడే అవకాశం ఆశావహులకు లభిస్తుంది. నెట్వర్క్ టేబుల్, ఈ-కనెక్ట్ వంటి వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, ప్రోత్సాహకులతో అనుసంధానం కావొచ్చు. ఆలోచనలు ప్రమోట్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు https://esummit21.page.link/RegisterNow ను సంప్రదించండి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?