ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన కేవలం కార్ల సంస్థనే కాదు, స్పేస్ ఎక్స్, పే పాల్ వంటి అనేక కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్న వ్యాపారవేత్త. ఏ కంపెనీని ప్రారంభించినా అందులో ఊహించని ఫలితాలు, లాభాలు సంపాదించగల ఘనుడు. అలాంటి ఎలన్ మస్క్ వద్ద ఒకప్పుడు కారుకు మరమ్మతులు చేయించేందుకు కూడా డబ్బులు ఉండేవి కాదట. అందుకే తన కారుకు తానే స్వయంగా మరమ్మతులు చేసుకునేవాడినని చెప్పారు. ఎలన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్టు చేయగా.. దానికి ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎలన్ మస్క్ ఓ కారుకు మరమ్మతులు చేస్తూ దిగిన ఫొటోను ప్రణయ్ పాతోల్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేస్తూ ‘1995లో ఎలన్ మస్క్.. తన కారు మరమ్మతులకు డబ్బులు చెల్లించే స్థోమత లేక తానే మరమ్మతులు చేసుకుంటున్నారు’అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఎలన్‌కు చేరడంతో దీనిపై స్పందిస్తూ ‘కారు గ్లాస్ మార్చడం కోసం మరో గ్లాస్‌ను జంక్‌యార్డ్ (పాత వాహనాలను తుక్కుగా వేసే ప్రాంతం)లో 20 డాలర్లకే కొన్నాను. కారుకు సంబంధించి విడిభాగాలు కొనుగోలు చేయడానికి అదే మంచి చోటు’ అని రీట్వీట్ చేశారు. నిజానికి ఆ ఫొటోను ఎలన్ మస్క్ తల్లి మాయె మస్క్ 2019లో పోస్టు చేశారు. ఆ ఫొటో పోస్టుకు ఎలన్ సమాధానమిస్తూ ‘అప్పట్లో కారు మరమ్మతులకు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అందుకే కారులో సమస్యలున్న అన్ని భాగాలను జంక్‌యార్డ్ నుంచి కొనుగోలు చేసిన విడిభాగాలతో సరి చేశాను. పగిలిన సైడ్ విండో గ్లాస్‌ను మారుస్తూ ఫొటోలో కనిపిస్తున్నది నేనే.’’అని పేర్కొన్నారు. 1993లో ఎలన్.. 1,400 డాలర్లు పెట్టి 1978 మోడల్ బీఎండబ్ల్యూ 320ఐ కారును కొనుగోలు చేశారు. దానికే మరమ్మతులు చేస్తూ ఈ ఫొటో దిగారు.
ప్రపంచ కుబేరుడిగా మారిన ఎలన్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆయన తండ్రి ఎరోల్ మస్క్ ఎలక్ట్రోమెకానికల్ ఇంజినీర్. అంతేకాదు, పైలట్, నావికుడు, స్థిరాస్తి వ్యాపారి. తల్లి మాయె మస్క్ మోడల్, డైటీషియన్. ఎలన్ కుటుంబం మొదటి నుంచి ఎగువ మధ్యతరగతి కుటుంబమే. 1995లో ఎలన్ తన సోదరుడు మరో వ్యక్తితో కలిసి జిప్2 అనే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. ఆ తర్వాత ఎక్స్ డాట్ కామ్, పేపాల్, స్పేస్ ఎక్స్, టెస్లా ఇలా అనేక కంపెనీలు ప్రారంభించి కోట్లకు పడగలెత్తారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?