చందాకొచ్చర్‌కు బెయిల్‌.. కానీ - ex icici bank ceo chanda kochhar granted bail
close

Published : 12/02/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చందాకొచ్చర్‌కు బెయిల్‌.. కానీ

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా ఆమె దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.1875 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవనీతికి పాల్పడ్డ అభియోగాలపై  చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది సెప్టెంబరులో దీపక్‌ కొచ్చర్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అభియోగాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చందాకొచ్చర్‌తో పాటు మిగతా నిందితులు కూడా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని జనవరి 30న ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో చందాకొచ్చర్‌ నేడు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆమె బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థనను స్వీకరించిన కోర్టు.. రూ.5లక్షల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. మనీలాండరింగ్‌ కేసు నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చందాకొచ్చర్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

ఎస్‌బీఐ కొత్త గృహరుణ వడ్డీరేట్లు ఎంతో తెలుసా?

ప్రభుత్వ అంచనాలను పరిశ్రమలు అందుకోవాలి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని