కొవిడ్‌తో మరణిస్తే పదవీ విరమణ వయసు వరకూ వేతనం చెల్లిస్తాం: వేదాంతా - f we die with Kovid we will pay the salary till retirement age: Vedanta
close

Updated : 15/06/2021 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో మరణిస్తే పదవీ విరమణ వయసు వరకూ వేతనం చెల్లిస్తాం: వేదాంతా

దిల్లీ: కొవిడ్‌-19తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు సదరు ఉద్యోగి పదవీ విరమణ వయసు వరకు, చివరి నెల తీసుకున్న వేతనాన్ని స్థిర (ఫిక్స్‌డ్‌) వేతనంగా అందిస్తామని వేదాంతా వెల్లడించింది.  తమ వ్యాపార భాగస్వాములు ఎవరైనా కొవిడ్‌తో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపింది. వేదాంతా కుటుంబం, తమ వ్యాపార భాగస్వాముల కోసం గంపగుత్తగా టీకాలు కొనుగోలు చేసేందుకు రూ.12.6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. వైద్య బీమా కవర్‌ కూడా ప్రస్తుతం ఉన్న దాని కంటే 1.5 రెట్లు పెంచుతున్నామని, వ్యాపార భాగస్వాములకు కొవిడ్‌ కవచ్‌ బీమా సదుపాయం కల్పిస్తున్నామని వివరించింది.

టైమ్స్‌ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ 16 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించి, నిర్వహిస్తున్న టైమ్స్‌ గ్రీన్‌ ఎనర్జీ (ఇండియా) తొలి పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమై 22న ముగియనుంది. రూ.4.05 కోట్ల మేరకు సమీకరించాలన్నది సంస్థ యత్నం. రూ.10 ముఖ విలువగల షేరు ధర రూ.61గా నిర్ణయించింది. ఈ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు, మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వస్తువులనూ ఉత్పత్తి చేస్తోంది. 2019-20లో రూ.20 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మి తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని