close

తాజా వార్తలు

ఈ పారిశ్రామికవేత్తను గుర్తుపట్టగలరా?

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎవరో గుర్తు పట్టారా? అయితే, మీకో క్లూ! భారత్‌లోనే అతిపెద్ద గ్రూప్‌నకు ఛైర్మన్‌ ఆయన. పేరులోనే కంపెనీ పేరు కూడా ఉంటుంది. ఈ పాటికే  ఆయనెవరో అర్థమైపోయి ఉంటుంది. ఆయనే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన ఆయన గురువారం ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. కొద్ది గంటల్లోనే ఈ చిత్రం వైరల్‌ అయ్యింది.

ఈ చిత్రాన్ని రతన్‌ టాటా పోస్ట్‌ చేస్తూ భారత్‌ రాకముందు లాస్‌ ఏంజెలెస్‌లో దిగినప్పటి చిత్రమని తెలిపారు. ఈ చిత్రాన్ని బుధవారమే పోస్ట్‌ చేద్దామనుకున్నారట. అయితే, #ThrowbackThursday గురించి విని ఈ చిత్రాన్ని ఇవాళ పోస్ట్‌చేశారు. వ్యక్తులు తమ పాత చిత్రాలను పోస్ట్‌ చేయడానికి ఇటీవల సోషల్‌మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో తన పాత చిత్రాన్ని గురువారం పోస్ట్‌ చేశారు. నాటి రతన్‌ టాటాను చూసిన పలువురు నెటిజన్లు.. హాలీవుడ్‌ హీరోలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్‌కు 2.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.