ప్రపంచమంతా ఓవైపు.. భారత్‌, చైనా మరోవైపు - fdi in india rose by 13pc in 2020
close

Published : 25/01/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచమంతా ఓవైపు.. భారత్‌, చైనా మరోవైపు

సంక్షోభంలోనూ భారీగా ఎఫ్‌డీఐలను రాబట్టిన ఆసియా దిగ్గజాలు

న్యూయార్క్‌ : కరోనా సంక్షోభం మూలంగా ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. భారత్‌, చైనా మాత్రం అందుకు మినహాయింపని ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఎఫ్‌డీఐలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరినట్లు తెలిపింది. మరోవైపు 2020లో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు ‘యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్ డెవలప్‌మెంట్‌(యూఎన్‌సీటీఏడీ)’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా డిజిటల్‌ సెక్టార్‌, ఇన్ఫర్మేషన్‌ కన్సలింగ్‌, ఈ-కామర్స్‌, డేటా ప్రాసెసింగ్‌, డిజిటల్‌ పేమెంట్స్‌ రంగాల్లోకి పెట్టుబడులు భారీగా వచ్చినట్లు తెలిపింది. అలాగే భారత్‌లోకి సీమాంతర కొనుగోళ్లు - విలీనం(ఎంఅండ్‌ఏ) ద్వారా వచ్చిన పెట్టుబడులు 83 శాతం పెరిగినట్లు పేర్కొంది. రిలయన్స్‌ జియో ప్లామ్ ‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ 9.9 శాతం వాటాల కొనుగోలు సహా ఇంధన రంగంలోని మరికొన్ని కంపెనీలతో కుదిరిన ఒప్పందాలతో ఎంఅండ్‌ఏ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.

ఇక 2019తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐలు 42 శాతం తగ్గినట్లు తెలిపింది. 2019లో 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివెళ్లగా.. 2020లో అవి 859 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు పేర్కొంది. 1990 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయి ఎఫ్‌డీఐలు నమోదుకావడం ఇదే తొలిసారని తెలిపింది. 2008-2009 తలెత్తిన సంక్షోభం సమయంలో నమోదైన దాని కంటే కూడా గత ఏడాది 30శాతం తగ్గినట్లు వెల్లడించింది.

ప్రధానంగా యూకే, ఇటలీ, రష్యా, జర్మనీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఎఫ్‌డీఐలు 69శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కరోనా నుంచి కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. 2021లో కూడా ఎఫ్‌డీఐల వృద్ధి ఆశాజనంగా ఉండే అవకాశాలు లేవని అంచనా వేసింది. 

ఇవీ చదవండి...

బీపీసీఎల్‌ వినియోగదారులకు అదనపు రివార్డు పాయింట్లు

ఎస్‌బీఐ.. పోస్టాఫీస్.. రిక‌రింగ్‌ డిపాజిట్‌.. ఏది మేలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని