కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట - finance minister nirmala sitharaman budget speech
close

Updated : 01/02/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

దిల్లీ: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి  కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.  దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.  పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ ప్రారంభించనున్నట్ట చెప్పారు. ఈ పథకం ద్వారా 87వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.లక్షా 41వేల 678 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు

ఇవీ చదవండి...

బడ్జెట్‌ ‘ట్యాబ్‌‌‌’తో నిర్మలమ్మ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని