టైమ్ జాబితాలో ‘భారతీయం’ - five indian-origin persons indian activist feature in time magazines list
close

Published : 18/02/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైమ్ జాబితాలో ‘భారతీయం’

న్యూయార్క్‌: టైమ్‌ మ్యాగజైన్‌ ప్రతి సంవత్సరం భవిష్యత్తును రూపొందించగలిగే సత్తా ఉన్న వందమంది యువ నాయకులను ఎంపికచేసి.. సదరు జాబితాను విడుదల చేస్తుందనే సంగతి తెలిసిందే. కాగా 2021 సంవత్సరానికి గాను ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో ఒక భారతీయుడు, ఐదుగురు భారత సంతతి వ్యక్తులు స్థానం సంపాదించుకోవటం గమనార్హం.

భారత్‌కు చెందిన సామాజిక కార్యకర్త, భీమ్‌ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అజాద్‌ ఈ గౌరవం దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇక భారతి సంతతి వ్యక్తుల్లో.. ట్విటర్‌ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న విజయ గద్దె, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌లతో పాటు.. ఇన్‌స్టాకార్ట్‌ వ్యవస్థాపకురాలు- సీఈఓ అపూర్వ మెహతా, స్వచ్ఛంద సేవా సంస్థ ‘గెట్‌ అజ్‌ పీపీఈ’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శిఖా గుప్తా,  మరో స్వచ్ఛంద సంస్థ ‘అప్‌సాల్వ్‌’ ను స్థాపించి అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన 25 ఏళ్ల రోహన్‌ పావులూరి ఉన్నారు. వీరిలో రోహన్‌ తెలుగు మూలాలున్న వారని తెలిసింది. 

చికాగోలో నివసిస్తున్న రోహన్‌ ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. తక్కువ ఆదాయమున్న, దివాలా తీసిన అమెరికన్లు మళ్లీ కొత్త జీవితం ప్రారంభించేందుకు అప్‌సాల్వ్‌ ద్వారా చేయూతనిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్న ప్రతివారూ చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని.. నిజానికి వీరిలో చాలామంది ఇప్పటికే చరిత్ర సృష్టించారన్నారని టైమ్‌ జాబితా ఎడిటోరియల్‌ డైరక్టర్‌ డేన్‌ మక్సాయ్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఇవీ చదవండి..

ఆస్ట్రేలియాలో వార్తాసేవలు నిలిపివేసిన ఫేస్‌బుక్‌

అమెరికాకు మన ఔషధాలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని