ఆదాయ అంతరాయాలను ఎదుర్కోవడానికి 5 మార్గాలు... - five ways to face Income disruption due to the covid crisis
close

Updated : 01/01/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయ అంతరాయాలను ఎదుర్కోవడానికి 5 మార్గాలు...

స్నేహితులు లేదా బంధువుల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది

కొవిడ్ -19 కారణంగా ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి చాలా మంది జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇటువంటి అనిశ్చిత సమయాలలో ముందస్తు ఆర్థిక ప్రణాళిక, 9 నుంచి 12 నెలల వరకు ఈఎంఐలు, బీమా ప్రీమియంతో సహా నెలవారీ తప్పనిసరి ఖర్చులకు తగిన అత్యవసర నిధిని కలిగి ఉండడం మంచిది. ఒకవేళ అత్యవసర నిధిని కలిగి లేనివారు కొన్ని స్మార్ట్ మనీ మూవ్స్ ని అనుసరించడం ద్వారా వారి నగదు ప్రవాహాన్ని తగ్గించుకోవచ్చు.

మొదటగా స్నేహితులు లేదా బంధువుల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. ఇది వడ్డీ వ్యయాన్ని ఆదా చేయడంతో పాటు రుణదాత అందించే దానికంటే ఎక్కువ తిరిగి చెల్లించే వశ్యతను పొందటానికి సహాయపడుతుంది. ఒకవేళ అది కూడా సరిపోదని భావించినట్లైతే ఆదాయ అంతరాయాలు, ద్రవ్య అసమతుల్యతలను పరిష్కరించడానికి ఈ కింది ఆప్షన్లను అనుసరించండి.

మీ స్థిర ఆదాయ పెట్టుబడులను రెడీమ్ చేయండి :

కీలకమైన ఆర్థిక లక్ష్యాలతో ముడిపడి లేని ప్రస్తుత పెట్టుబడులను రీడీమ్ చేయడం మంచిది. ఈక్విటీ-ఆధారిత పథకాలలో పెట్టుబడులు గణనీయమైన తేడాతో ఉంటాయి, కావున వాటిని రెడీమ్ చేయడం నష్టాలకు దారి తీస్తుంది. పెట్టుబడిదారులు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు లేదా డెట్ ఫండ్స్ వంటి స్థిర ఆదాయ సాధనాలను గుర్తించడం ప్రారంభించాలి. ఈ సాధనాల నుంచి పొందే వడ్డీ రేటు సాధారణంగా చౌకైన రుణ ఆప్షన్ లపై వసూలు చేసే వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటాయి.

ప్రస్తుత ఆర్థిక దృష్టాంతంలో వడ్డీ వ్యయంపై పొదుపు చేయడం కంటే ద్రవ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అవసరం, కావున రుణ ముందస్తు చెల్లింపులు చేయడానికి మీ స్థిర ఆదాయ పెట్టుబడులను రీడీమ్ చేయడం మానుకోండి.

టర్మ్ లోన్ ల కోసం తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకొండి :

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు తమ టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ రుణగ్రహీతలకు 3 నెలల తాత్కాలిక నిషేధాన్ని ఇవ్వడానికి అనుమతించింది. అందువలన నగదు ప్రవాహ అంతరాయాలు కారణంగా రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్న రుణగ్రహీతలు రుణ తాత్కాలిక నిషేధాన్ని పొందడాన్ని పరిగణించవచ్చు. కానీ మారటోరియం పీరియడ్ లో వారి బకాయిలపై వడ్డీ పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.

క్రెడిట్ కార్డు బకాయిలను ఈఎంఐ ఎంచుకోండి :

ప్రస్తుత కోవిడ్-19 ప్యాండమిక్ లో క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలను పూర్తిగా తిరిగి చెల్లించడం కొంచం కష్టంగా ఉంటుంది. అందువలన క్రెడిట్ కార్డు బకాయిలను ఈఎంఐలుగా మార్చడం వలన పెద్ద మొత్తాన్ని తిరిగి చెల్లించే భారాన్ని తగ్గించవచ్చు. వీటికి వడ్డీ రేటు 12 శాతం నుంచి 15 శాతంగా ఉంటుంది. అలాగే 3 నెలల నుంచి 48 నెలల కాలపరిమితి అందుబాటులో ఉంటుంది, పెద్ద ఖర్చులను ఈఎంఐలుగా మార్చడం వలన భారీ చార్జీల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు, ఒకవేళ మీరు నిర్ణీత తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించడంలో విఫలమైతే, చెల్లించని క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ రేటు సంవత్సరానికి 23 నుంచి 49 శాతంగా ఉంటుంది.

మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐలుగా మార్చడానికి కూడా మీరు ఎంచుకోవచ్చు. అలా చేయడం వడ్డీ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, రుణదాతలు సాధారణంగా 12 శాతం నుంచి 21 శాతం వడ్డీ రేటుతో బ్యాలెన్స్ మార్పిడిని అందిస్తారు. దీనికి తోడు, మీకు అవసరమైన నగదు ఆధారంగా 3 నెలల నుంచి 60 నెలల మధ్య కాలపరిమితిని కూడా ఎంచుకోవచ్చు.

ఈపీఎఫ్ కార్పస్ నుంచి ఉపసంహరించుకోండి :

ఈపీఎఫ్ చందాదారులకు వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు లేదా మూడు నెలల ప్రాథమిక జీతం, డీఏ ఏది తక్కువగా ఉంటే దానిని ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, సాధ్యమైనంత వరకు ఈపీఎఫ్ నుంచి నగదు ఉపసంహరించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది ఖచ్చితమైన అత్యధిక పన్ను రహిత రాబడిని అందిస్తుంది.

పెట్టుబడులపై రుణం తీసుకోండి :

మీ స్వల్పకాలిక ద్రవ్య అసమతుల్యతను తగ్గించడానికి మీ మార్కెట్-లింక్డ్ పెట్టుబడులపై రుణం పొందడం గురించి పరిగణించవచ్చు. సెక్యూరిటీలపై రుణాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో అందిస్తారు. తిరిగి చెల్లించే వరకు ఉపసంహరించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు. వడ్డీ రేట్లు సాధారణంగా అసురక్షిత రుణాల కంటే తక్కువగా ఉంటాయి. ఏదేమైనా, రుణ మొత్తం సెక్యూరిటీల రకం, సంబంధిత బ్యాంకులు నిర్ణయించిన వారి ఎల్‌టీవీ నిష్పత్తులపై ఆధారపడి ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని