ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు - ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుంది? - fixed-deposits-interest-rates
close

Updated : 05/02/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు - ఏ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుంది?

బ్యాంకుల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు బ్యాంకుల‌లో పెట్టుబ‌డి పెట్టేవారికి ఆశించినంతగా లేవు. ఎఫ్‌డీల‌లో అధిక మొత్త‌ పెట్టుబ‌డి గాని, ఎక్కువ‌ కాలానికి గాని ఇన్వెస్ట్ చేసేవారికి ఇప్పుడున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీరేట్లు అంత ఆశాజ‌న‌కంగా లేవ‌నే చెప్పాలి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధార‌ణ పెట్టుబ‌డి సాధ‌నాల‌గానే మిగిలాయి. హామి ఆదాయం కోసం చూసే ఇన్వెస్ట‌ర్ల‌కు, ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ వ‌డ్డీ రేట్లు అంత బ‌రోసా ఇవ్వ‌ట్లేద‌నే చెప్పాలి.

ఉదాహ‌ర‌ణ‌కు 15 సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న దీర్ఘ‌కాలానికి పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, వివాహాల‌కు అవ‌సార్ధం త‌క్కువ వ‌డ్డీనిచ్చే దీర్ఘ‌కాలిక డిపాజిట్లు వేయ‌డం అంత మంచి ప‌ని కాద‌నే పొదుపుదార్ల‌కు అర్ధం అవుతుంది.  2 సంవ‌త్స‌రాల‌కు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేయ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంత మంచి ప‌ని కాద‌నే చెప్పాలి. ఎందుకంటే డిపాజిట్లకు వ‌చ్చే వ‌డ్డీ, అనంత‌రం విధించ‌బ‌డే ప‌న్ను, పెరిగే ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా మీకు ఆశించినంత రాబ‌డి త‌గ్గిపోయింది.

వివిధ ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్ రంగ బ్యాంకుల‌లో రూ. 1 కోటి వ‌ర‌కు న‌గ‌దుకు, వివిధ కాలాల‌కు వ‌డ్డీ రేట్లు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని