ఫ్లిప్‌కార్ట్‌ వశం కానున్న క్లియర్‌ ట్రిప్‌..! - flipkart to acquire cleartrip
close

Published : 15/04/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లిప్‌కార్ట్‌ వశం కానున్న క్లియర్‌ ట్రిప్‌..!

న్యూదిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ క్లియర్‌ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకోవడం ఖాయమైంది. క్లియర్‌ ట్రిప్‌నకు సంబంధించిన 100శాతం వాటాలను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, వినియోగదారులకు చేరువ చేసేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. నిర్వహణ వ్యవహారాలను ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకున్న తర్వాత కూడా క్లియర్‌ ట్రిప్‌ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగనుంది. ఉద్యోగులందరూ యథావిధిగా కొనసాగడంతో పాటు, సంస్థ అభివృద్ధి కోసం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి పనిచేయనున్నారు.

అయితే, ఎంత మొత్తానికి క్లియర్‌ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సొంతం చేసుకోనుందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్‌ విలువ 40 మిలియన్‌ డాలర్లు ఉండవచ్చని వాణిజ్య పత్రికలు అంచనా వేస్తున్నాయి.  ‘డిజిటల్‌ వేదికగా వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ కట్టుబడి ఉంది. పర్యటనలకు క్లియర్‌ ట్రిప్‌ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ బ్రాండ్‌ను కొనసాగిస్తూనే, కొత్త ప్రాంతాల్లో సంస్థను వృద్ధి చేస్తాం. పెట్టుబడులు ఇందుకు మరింత ఉపయుక్తమవుతాయని భావిస్తున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. పర్యాటక రంగం, టెక్నాలజీ విషయంలో క్లియర్‌ట్రిప్‌నకు ఎంతో అనుభవం ఉందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని