బడ్జెట్ 2021: డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహకాలు.. - fm sitharaman proposes rs 1500 crore to promote digital payments
close

Published : 01/02/2021 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్ 2021: డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహకాలు..

దిల్లీ: దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బడ్జెట్ 2021-22‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజా బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

గతేడాది బడ్జెట్ ప్రసంగంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)ను సీతారామన్ ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో మంత్రి దాని గురించి ప్రస్తావిస్తూ, రాబోయే ఐదేళ్లలో రూ.50,000 కోట్లు ఎన్‌ఆర్‌ఎఫ్‌కు కేటాయించనున్నామని తెలిపారు. ఇది దేశ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని, రాబోయే రోజుల్లో అవసరమైన రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. అలానే నేషనల్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రతిపాదించిన నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఐపీ)కు పెద్ద ఎత్తున నిధులు సమాకూర్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా డెవలెప్‌మెంట్ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్‌ఐ) ప్రారంభించేందుకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో ఇందులో విస్తరణకు అవకాశం ఉన్న ప్రతి విభాగాన్ని రూ.5 లక్షల కోట్లతో బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌ఐపీ దేశవ్యాప్తంగా రూ. 7 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడుతోంది.

ఇవీ చదవండి..

బడ్జెట్‌ 2021-22 ముఖ్యాంశాలు

బడ్జెట్‌: నేల విడవని నిర్మలమ్మ..!


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని