ప్రైవేటు రంగ పెట్టుబడులు రావాలి: సీతారామన్‌ - fm urges industry to make india fastest growing economy
close

Published : 20/02/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు రంగ పెట్టుబడులు రావాలి: సీతారామన్‌

దిల్లీ: భారత్‌లో కొత్త పెట్టుబడులు పుంజుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అందుకు ప్రైవేట్‌ వ్యాపార వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ)’ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు ఊపందుకునేలా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. ముఖ్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత పరిశ్రమ వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని భావించామన్నారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు ఎంతో కీలకమని సీతారామన్‌ తెలిపారు. అందుకనుగుణంగా వ్యాపార విస్తరణ, ఉత్పత్తి పెంపు జరగాల్సిన అసవరం ఉందన్నారు. దీనికి ప్రైవేటు వర్గాలనే ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు 2019 సెప్టెంబరులో కార్పొరేట్‌ పన్నును 10 పర్సెంటేజీ పాయింట్లు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

బ్యాంకు లాకర్లపై 6నెలల్లో మార్గదర్శకాలివ్వండి

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికవృద్ధి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని