చిన్న పరిశ్రమలకే పెద్ద దెబ్బ..! - four things indias small manufacturing players need from this budget
close

Updated : 30/01/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న పరిశ్రమలకే పెద్ద దెబ్బ..!

కరోనా గాయం నుంచి కోలుకునేనా..

ఇంటర్నెట్‌డెస్క్‌: పారిశ్రామిక రంగం కొవిడ్‌ కారణంగా అత్యధికంగా నష్టపోయింది. వీటిలో కూడా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపైనే ప్రభావం ఎక్కువగా పడింది. అర్ధాంతరంగా లాక్‌డౌన్‌ విధించడం.. కార్మికులు వలస పోవడంతో సడలింపుల అనంతరం కూడా ఫ్యాక్టరీలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత సంక్షోభాన్ని చిన్న పరిశ్రమలు ఎన్నడూ చూడలేదు. వాస్తవానికి ఈ సంక్షోభం భారత్‌కు అవకాశాలను కూడా అందించింది. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయాలను వెదకటం ప్రపంచం ప్రారంభించింది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్‌ సరైన వ్యూహాన్ని అనుసరించాలి. దానిని పక్కాగా అమలు చేయాలి. అప్పుడే భారత‌ అభివృద్ధి వేగవంతం అవుతుంది. కొన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తే ఉత్పత్తి రంగంలో వేగం పెరుగుతుంది. వాస్తవానికి అన్ని రంగాలకు ఇప్పుడు ఉపశమనాలు అవసరమే. కానీ, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లకు ఊతం ఇవ్వడం వల్ల వేగంగా పుంజుకొనే అవకాశం ఉంది.

పీఎల్‌ఐ స్కీమ్‌ను విస్తరించాలి..

ప్రభుత్వం గత మార్చిలో ప్రవేశపెట్టిన ప్రొడక్షన్‌ లింక్‌ ఇన్సెంటీవ్‌ స్కీంను మిగిలిన రంగాలకు కూడా విస్తరించాలి.  ఈ స్కీమ్‌ను దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రారంభించారు. దేశీయంగా తయారు చేసిన వస్తువుల విక్రయాలపై రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీనిని ఇప్పటి వరకు మొబైల్‌ ఫోన్లు, వాటి అనుబంధ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్‌ ముడి పదార్థాలు, వైద్యపరికరాల తయారీ వంటి వాటికి వర్తింపజేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన రంగాలకు కూడా దీనిని వర్తింపజేయాలి. ఇవి దేశీయంగా పెట్టుబడులను, అసెంబ్లింగ్‌ను, ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తాయి. 

పన్ను రేట్లలో వెసులుబాటు..

ప్రత్యేక్ష, పరోక్ష పన్నుల్లో ఉన్న సంక్లిష్ట విధానాలను తొలగించి.. వాటిని మరింత సరళతరంగా తీర్చిదిద్దాలి. దీంతోపాటు పన్ను భారం కొన్నాళ్లపాటు తగ్గితేనే ఆయా సంస్థలు కోలుకుంటాయి. ప్రస్తుతం ఉన్న పన్ను వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉందని పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. గతంలో టెస్లా వంటి కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టేందుకు ఈ పన్ను వ్యవస్థే అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. దీంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండాలి. లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా కేసులు ఓడిపోతూ.. చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా వొడాఫోన్‌ కేసులో అటువంటి పరిస్థితే ఎదురైంది. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యధిక పన్ను రేట్లు ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇది దేశీయంగా ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేసిన వారికి కూడా భారంగా మారుతుంది.

ప్రోత్సాహకాలు..

భారత్‌లో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు తయారీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా తయారీ వృద్ధిలో చిన్న పరిశ్రమలు అత్యంత కీలక పాత్రను పోషించాయి. ఈ సారి బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈ సెక్టార్‌ను ప్రోత్సహించాలి. దీంతోపాటు ఇప్పటి వరకూ  ప్రోత్సాహకాలు అందని వ్యవసాయ రంగంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలి.

దీంతోపాటు సరికొత్త తరం ఆర్థిక విధానాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దీనిలో గిగ్‌ వర్కర్స్‌(కొన్నాళ్లు ఒప్పందం కుదుర్చుకొని పనిచేసే నిపుణులు), ఆగ్రిగేటర్స్‌ కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కార్మిక చట్టాల అమలు, చెల్లింపులను పకడ్బందీగా చూడాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి

టార్గెట్‌ రూ.19 లక్షల కోట్లు..?

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని