వరుసగా ఏడోరోజు పెరిగిన ఇంధన ధరలు - fuel price hike petrol diesel prices hiked for seventh straight day
close

Published : 15/02/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా ఏడోరోజు పెరిగిన ఇంధన ధరలు

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో సోమవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది ఏడోరోజు కావడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 26పైసలు పెరిగి రూ.88.99గా నమోదైంది. లీటర్‌ డీజిల్‌పై 29పైసలు పెరిగి రూ.79.35 వద్ద నిలిచింది. 

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో రూ.95 మార్కును తాకాయి. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.46 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.35 గా ఉంది. ఇక హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర గరిష్ఠ స్థాయిలో నమోదైంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.53 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.55 గా నమోదైంది. కాగా ఇంధన ధరలు ఇలా అమాంతం పెరుగుతూ పోతుంటే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి. వెంటనే ఇంధన ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.   

ఇదీ చదవండి

సూచీలు స్తబ్దుగానే!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని