close

Updated : 27/02/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి ఎగబాకిన ఇంధన ధరలు

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు శనివారం మరోసారి ఎగబాకాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25పైసలు వరకు పెంచాయి. కాగా కేవలం ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి. దిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17గా, డీజిల్‌ ధర రూ.81.47గా నమోదైంది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.97.57, డీజిల్‌ రూ.88.70కి చేరుకుంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 17పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్‌  ధర రూ.94.79, డీజిల్‌ ధర రూ.88.86గా నమోదైంది. గడిచిన 30 రోజుల్లో రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.5 పెరగడం గమనార్హం.  కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గత 58రోజుల్లో చమురు ధరలు 26సార్లు పెరగడం గమనార్హం.

ఇవీ చదవండి..

సాగరం.. గరం

అమ్మ.. నాన్న.. అన్న.. అన్నీ ఆమె..!

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని