చమురు ధర: కొనసాగిన పరంపర - fuel prices hiked for 11th straight day petrol crosses rs 90 mark in delhi
close

Published : 19/02/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చమురు ధర: కొనసాగిన పరంపర

దిల్లీ: చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోలు ధర రూ.90 మార్కును దాటింది. పెంచిన ధరలతో అక్కడ లీటరు పెట్రోలు  రూ.90.19, డీజిల్‌ ధర రూ.80.60కి చేరింది. వరుసగా 11 రోజుల్లో కలిపి లీటరు పెట్రోలుపై రూ.3.24, డీజిల్‌పై 3.47 చొప్పున పెరిగింది.
 

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.93.78కు చేరింది. డీజిల్‌ ధర రూ.87.91గా నమోదైంది. హైదరాబాద్‌లో ఈనెల 1వ తేదీన లీటరు పెట్రోలు ధర రూ.89.77, డీజిల్‌ రూ.83.46 ఉండగా ఇప్పటికి పెట్రోలుపై రూ.3.99, డీజిల్‌పై రూ.4.42 పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అత్యధికంగా లీటర్‌ పెట్రోలు ధర రూ.96.62గా నమోదైంది. డీజిల్ ధర రూ.87.67గా ఉంది.

ఇవీ చదవండి..

‘మరోసారి ఆ తప్పు జరగదు’

కరోనాపై పోరులో ప్రాంతీయ సహకారం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని