close
Array ( ) 1

తాజా వార్తలు

ఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకు అత్యవసర రుణాలు: సిడ్బీ

ముంబయి: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈలు)కు అత్యవసర మూలధనం కింద రూ.కోటి వరకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ) ప్రకటించింది. తనఖా అవసరం లేని ఈ రుణాలను సిడ్బీ అసిస్టెన్స్‌ కింద ఇవ్వనుంది. ఈ రుణాలను కేవలం 48 గంటల్లోపే మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ రుణాలపై వడ్డీ రేటును 5 శాతంగా నిర్ణయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు)కు సేఫ్‌ కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు వివరించింది. కొవిడ్‌-19 నియంత్రణకు వినియోగించే చేతి శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌవ్స్‌, హెడ్‌గేర్‌, బాడీ సూట్లు, షూ కవర్లు, వెంటిలేటర్లు, గాగుల్స్‌ వంటి పరికరాల తయారీ నిమిత్తం ఎంఎస్‌ఎంఈలకు ఈ రుణాలు ఇస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.