close

తాజా వార్తలు

Updated : 17/04/2020 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులో: ఆర్‌బీఐ

ముంబయి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్న్ శక్తికాంతదాస్‌ అన్నారు. అన్నింటినీ అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై వైరస్‌ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న బ్యాంకు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పలు కీలక ప్రకటనలు చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

జీ-20 దేశాల్లో భారత వృద్ధి రేటే మేలు...
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం నెలకొందని శక్తికాంతదాస్‌ అన్నారు. 1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు, చమురు ధరలు భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపారు. 2020లో భారత్‌ 1.9శాతంగా ఉండనుందని చెప్పిన గవర్నర్‌ జీ20 దేశాల్లోకెల్లా ఇదే అత్యధికమని వెల్లడించారు.

బ్యాంకుల్లో నిధుల కొరత లేదు...

కరోనా కష్టకాలంలో ఏటీఎంల వినియోగం పెరిగిందని శక్తికాంత దాస్‌ తెలిపారు. బ్యాంకుల్లో నిధుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకు కార్యకలాపాలు యథాతథంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వేళ మొబైల్ బ్యాంకింగ్‌ సేవలు సజావుగా సాగుతున్నాయన్నారు. ఆర్‌బీఐ చర్యల వల్లే బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉందని 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఏడాది 7.4శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా వేశారు. మార్చిలో ఆటోమొబైల్‌, ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయని తెలిపారు. విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గిందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా 9 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఆర్‌బీఐ కీలక ప్రకటనలు...  

ఇప్పటి వరకు జీడీపీలో 3.2శాతం అందుబాటులోకి 
లాక్‌డౌన్‌ తర్వాత రూ. 1.2 లక్షల కోట్లు విడుదల
సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ
రివర్స్‌ రెపోరేటు 4 శాతం నుంచి 3.75శాతానికి తగ్గింపు. రెపో రేటు యథాతథం
రాష్ట్రాలకు 60శాతం మేర వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌(డబ్ల్యూఎంఏ) పెంపు. ఇది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్పకాలిక రుణాలను వేస్ డబ్ల్యూఎంఏగా వ్యవహరిస్తారు.
జాతీయ హౌసింగ్‌ బోర్డుకు రూ.10 వేల కోట్లు
నాబార్డుకు రూ.25వేల కోట్లు
మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు.
బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్‌ రేషియో(ఎల్‌సీర్‌)ను 100శాతం నుంచి 80శాతానికి తగ్గింపు. దీని వల్ల బ్యాంకుల నగదు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని తిరిగి 2020 అక్టోబర్ 1 నాటికి 90 శాతం, ఏప్రిల్ 1, 2021 నాటికి 100 శాతానికి పునరుద్ధరణ.   



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.