close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/07/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఓసీ ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ మాధ్‌ వైద్య బాధ్యతల స్వీకరణ

దిల్లీ: దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 30న పదవీ విరమణ చేసిన సంజీవ్‌సింగ్‌ స్థానంలో వైద్య వచ్చారు. 2019 అక్టోబరు నుంచి ఆయన ఐఓసీ బోర్డు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఐఓసీ రిఫైనింగ్‌ అనుబంధ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, టెర్మినలింగ్‌ సేవలు అందించే సంయుక్త సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకింగ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా కూడా వైద్య ఉంటారు. రత్నగిరి రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ అధిపతిగా, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తారు. రూర్కెల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన వైద్యకు,  పెట్రో రసాయనాల విభాగంలో 34 ఏళ్ల అనుభవం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.