close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబుర్లు

* టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 49,05,66,037 ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.2,600 కోట్లను టాటా పవర్‌ సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డ ఆమోదం తెలిపింది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.53. ఈ లావాదేవీ అనంతరం టాటా పవర్‌లో టాటా సన్స్‌ వాటా 35.27 శాతం నుంచి 45.21 శాతానికి పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్‌ వ్యాపారం నిమిత్తం మౌలిక పెట్టుబడుల ట్రస్ట్‌ (ఇన్‌విట్‌) ఏర్పాటుకు కూడా టాటాపవర్‌ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది.
* చైనా నుంచి 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను బహిష్కరించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు వెల్లడించింది. ఉక్కు, విద్యుత్‌, సిమెంట్‌, మౌలిక రంగాల వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ గ్రూపు ఏటా చైనా నుంచి 400 మిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులను చేసుకుంటోంది. రాబోయే 24 నెలల్లో ఈ విలువను సున్నాకు పరిమితం చేస్తామని పేర్కొంది.  
* నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ సిరీస్‌లో రెండు కొత్త సూచీలను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రారంభించింది. ఈ రెండు కొత్త సూచీల కాలపరిమితి వరుసగా 2025 ఏప్రిల్‌, 2031 ఏప్రిల్‌.
* వివిధ రకాల సెక్యూరిటీస్‌ల జారీ ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు 26వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) వాటాదార్ల అనుమతిని తీసుకుంటామని తెలిపింది. అలాగే జులై 31న వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో ఏజీఎంను నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
* మాక్స్‌ ఇండియా విభజన నేపథ్యంలో అంతకుముందున్న మ్యాక్స్‌ ఇండియాకు చెందిన ప్రస్తుత వాటాదార్లకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. అంతకుముందున్న మ్యాక్స్‌ ఇండియాలో రూ.2 ముఖ విలువతో 5 షేర్లను కలిగి ఉన్న వారికి.. కొత్త మ్యాక్స్‌ ఇండియా వాటాదారుగా రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరును కేటాయించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.