close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/07/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీఎస్‌టీ రిటర్న్‌లకు ఆలస్య రుసుం

గరిష్ఠంగా రూ.500

దిల్లీ: జీఎస్‌టీ నెలవారీ, త్రైమాసిక రిటర్న్‌ల దాఖలు ఆలస్యమైతే గరిష్ఠంగా ఒక్కో రిటర్న్‌కు రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 2017 జులై నుంచి 2020 జులై వరకు రిటర్న్‌లకు ఈ ఆలస్య రుసుం పరిమితి వర్తిస్తుంది. అయితే ఈ రిటర్న్‌లను కూడా 2020 సెప్టెంబరు 30లోగా దాఖలు చేయాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. ‘జీఎస్‌టీ చెల్లింపుదార్లకు ఊరట కల్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2017 జులై- 2020 జులై వరకు దాఖలు చేయాల్సిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌లకు ఆలస్య రుసుము గరిష్ఠ పరిమితిని రూ.500గా నిర్ణయించింద’ని ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి పన్ను బకాయిలు లేకుంటే ఆలస్యం రుసుము కూడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.