close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాయ్‌ అభ్యంతరాలపై ట్రైబ్యునల్‌కు వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: ప్రధాన్యతా సేవల కింద చందాదార్లకు డేటాను అధికవేగంతో వినియోగించడానికి వీలు కల్పించే తమ పథకాల అమలును నిలిపి వేయాలన్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశాలపై, టెలికాం వివాదాల పరిష్కార, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌)ను వొడాఫోన్‌ ఐడియా ఆశ్రయించింది. ఈ విషయమై తమ వాదనను త్వరగా విచారించాలని కోరింది. ప్రాధాన్యతా పథకాలు తాత్కాలికంగా నిలపాలని వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లను శనివారం ట్రాయ్‌ ఆదేశించింది. ఇతర చందాదార్లకు అసౌకర్యం కలిగిస్తూ, అధిక అద్దె చెల్లించేవారికి ప్రాధాన్యమిస్తారా అని ప్రశ్నిస్తూ, ఈ విషయమై వారంలోగా బదులివ్వాలని పేర్కొంది. తమ పరిశీలన పూర్తయ్యేవరకు ఆయా పథకాల అమలు నిలిపేయాలని కోరింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.