close

తాజా వార్తలు

Published : 13/08/2020 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ ఫోన్ల మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్‌

వాషింగ్టన్‌: నాలుగేళ్ల కిందట మొబైల్‌ వ్యాపారాన్ని నిలిపివేసిన తర్వాత మళ్లీ మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లోకి వచ్చింది. బుధవారం సర్ఫేస్‌ డ్యూయో అనే సరికొత్త రెండు తెరలుండే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. సెప్టెంబరులో అమ్మకాలు మొదలయ్యే ఈ ఫోన్‌ ధర 1399 డాలర్లు(దాదాపు రూ.1,05,000). సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ కంటే మరింత ఎక్కువ ఉపయోగాలు ఈ ఫోన్‌తో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ అంటోంది. రెండు వేర్వేరు యాప్‌లు లేదా రెండు వెబ్‌పేజీలు ఒకే సారి వినియోగించుకోవచ్చని తెలిపింది. ఉదాహరణకు ఒక తెరపై అమెజాన్‌ కిండిల్‌ యాప్‌లో పుస్తకాన్ని చదువుతూనే, మరో తెరపై నోట్స్‌ తీసుకోవచ్చని తెలిపింది.
ఇవీ ప్రత్యేకతలు: పుస్తకంలాగా తెరవగలిగే ఈ ఫోన్‌కు 5.6 అంగుళాల రెండు తెరలు ఉంటాయి. 4.8 మిల్లీమీటర్ల మందంతో మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న అత్యంత పల్చటి ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ అంతర్గత మెమొరీ దీని సొంతం. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో పాలు ఇంకా పలు ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.