close

తాజా వార్తలు

Published : 18/09/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పి-నోట్ల ద్వారా పెట్టుబడులు 10 నెలల గరిష్ఠానికి

ఆగస్టు చివరినాటికి రూ.74,000 కోట్లు

దిల్లీ: దేశీయ కేపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ ద్వారా పెట్టుబడులు 10 నెలల గరిష్ఠానికి చేరాయి. ఆగస్టు చివరి నాటికి రూ.74,000 కోట్లకు పెరిగాయి. పి-నోట్ల ద్వారా పెట్టుబడులు వరుసగా ఐదో నెలా పెరగడం గమనార్హం. మన మార్కెట్లపై విదేశీ మదుపర్లు మరింతగా ఆసక్తి చూపుతున్నారని చెప్పడానికి ఈ పెట్టుబడులే నిదర్శనం. భారత స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే విదేశీ మదుపర్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) ఈ పి-నోట్లను జారీ చేస్తారు. సెబీ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. ఆగస్టు చివరి నాటికి భారత కేపిటల్‌ మార్కెట్లలో (ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ సెక్యూరిటీస్‌, డెరివేటివ్స్‌ విభాగాలు) పి-నోట్ల ద్వారా విదేశీ మదుపర్లు పెట్టిన పెట్టుబడులు రూ.74,027 కోట్లు. జులై చివరినాటికి ఇది రూ.63,228 కోట్లుగా ఉంది. 2019 అక్టోబరులో నమోదైన రూ.76,773 కోట్ల తర్వాత ఆగస్టు చివరి నాటికి ఉన్న రూ.74,027 కోట్లే అత్యధికం కావడం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.