close

తాజా వార్తలు

Published : 19/09/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టెలికాం టారిఫ్‌లలో మరింత పారదర్శకత

నెట్‌వర్క్‌ సంస్థలకు ట్రాయ్‌ మార్గదర్శకాలు

షరతులను స్పష్టంగా వెల్లడించాలి

దిల్లీ: టెలికాం సంస్థలు తమ ఛార్జీల (టారిఫ్‌)ను మరింత పారదర్శకంగా, స్పష్టంగా, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా వెల్లడించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టం చేసింది. సమగ్ర సమాచారం లేకపోవడం, పథకాల వివరాలు అర్థం చేసుకునేందుకు క్లిష్టంగా ఉండటం వల్ల వినియోగదారులు తమకు కావాల్సిన పథకాలను ఎంచుకోలేకపోతున్నారని ట్రాయ్‌ వివరించింది. ఆఫర్లనూ వినియోగదార్లు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని, నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొంటూ, తాజా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ‘కొన్ని టెలికాం సంస్థలు ఆయా టారిఫ్‌ పథకాలు అమలయ్యేందుకు ఉండే అదనపు షరతులను ఒకే వెబ్‌ పేజీల్లో స్పష్టంగా వెల్లడించడం లేదు. అధిక సమాచారం నేపథ్యంలో, వినియోగదారులకు గందరగోళం ఏర్పడుతోంది. అందువల్ల ఆయా సేవలు, పథకాలు అమలయ్యే ప్రాంతాల వారీగా పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ ప్రతి పథకం టారిఫ్‌ల గురించి వినియోగదారులకు సమాచారం ఇవ్వాలి. వినియోగదారు సేవా కేంద్రాలు, రిటైల్‌ విక్రయశాలలు, వెబ్‌సైట్‌, యాప్‌లలోనూ ఈ సమాచారం ఉండాలి. కాల్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా ధరలు, పరిమితులు వంటివీ స్పష్టంగా వెల్లడించాల’ని కోరింది. ముందస్తుగా ఏమైనా అద్దె చెల్లించాలా, డిపాజిట్‌ కట్టాలో కూడా తెలపాల్సి ఉంటుంది. డేటా వేగం ఎంత ఉంటుంది, ఎంతవరకు వాడితే అధికవేగం, తదుపరి ఏ స్థాయిలో మాత్రమే లభిస్తుందో కూడా వివరించాలి. ప్రత్యేక టారిఫ్‌ ఓచర్లు, కాంబో వోచర్లు, యాడ్‌ ఆన్‌ ప్యాక్‌ల గురించీ తెలపాలి. ఇవన్నీ ఎలా అమలు చేస్తున్నారో వివరిస్తూ ట్రాయ్‌కు 15 రోజుల్లోగా సమగ్ర నివేదికనూ సంస్థలు సమర్పించాల్సి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.