close

తాజా వార్తలు

Published : 19/09/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగస్టులో రూ.13.85 లక్షల కోట్ల ఇ-వేబిల్లులు

దిల్లీ: వ్యాపార, రవాణా సంస్థలు ఆగస్టులో 4.87 కోట్ల ఇ-వేబిల్లులను తీసుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.13.85 లక్షల కోట్లు అని జీఎస్‌టీఎన్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతరాష్ట్ర సరకు రవాణా విలువ రూ.50,000 మించితే తప్పక ఇ-వేబిల్లును తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరిగే సరకు రవాణాకు ఈ పరిమితి విషయంలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉంది. జీఎస్‌టీఎన్‌ గణాంకాల ప్రకారం.. జులైలో 4.76 కోట్ల ఇ-వేబిల్లులు తీసుకోగా, వీటి మొత్తం విలువ రూ.13.66 లక్షల కోట్లు. జూన్‌లో 4.27 కోట్లు (విలువ రూ.12.40 లక్షల కోట్లు), మేలో 2.51 కోట్లు (రూ.8.98 లక్షల కోట్లు), ఏప్రిల్‌లో 84.53 లక్షలు (రూ.3.9 లక్షల కోట్లు), మార్చిలో 4 కోట్లు (రూ.11.43 లక్షల కోట్లు) చొప్పున ఇ-వేబిల్లులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఉన్న గణాంకాల ప్రకారం చేస్తే.. ఆర్థిక ప్రగతి పుంజుకుంటోందనే విషయం అర్థమవుతోంది. నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇ-వేబిల్లు పోర్టల్‌ నుంచి నెల రోజుల కాలానికి ఇ-వేబిల్లుల వివరాలను వ్యాపారాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జీఎస్‌టీఎన్‌ తెలిపింది. ఇంతకుముందు 5 రోజులవి మాత్రమే ఇ-వేబిల్లుల వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుండేది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.