close

తాజా వార్తలు

Published : 22/09/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబుర్లు

* కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌(క్యామ్స్‌) ఇష్యూకు తొలి రోజైన సోమవారం 82 శాతం స్పందన లభించింది. మొత్తం 1,28,27,370 షేర్లకు గాను 1,05,75,864 బిడ్లు దాఖలయ్యాయి.

* కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు మొదటి రోజునే 5.2 రెట్ల స్పందన దక్కింది. మొత్తం 65,47,061 షేర్లకు గాను 3.4 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. రిటైల్‌ మదుపర్ల నుంచి 9.86 రెట్ల స్పందన లభించింది.

* ఎమ్‌పీ బిర్లా గ్రూప్‌లోని ఏ కంపెనీకి చెందిన కార్యాలయంలోనూ వ్యక్తిగతంగా కార్యకలాపాలు నిర్వహించకుండా నిలువరిస్తూ ఏకసభ్య దర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కోల్‌కతా హై కోర్టు డివిజన్‌ బెంచ్‌లో హర్ష్‌ వర్థన్‌ లోధా సోమవారం అప్పీలు చేశారు.

* యెస్‌ బ్యాంకు వినియోగదార్లకు జీవిత బీమా పాలసీలను విక్రయించేందు కోసం ఆ బ్యాంకుతో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

* రైల్వే విద్యుదీకరణ పనుల నిమిత్తం ఆర్‌ఐటీఈఎస్‌కు రూ.474.92 కోట్ల కాంట్రాక్టు దక్కింది. ఆ మేరకు రైల్వేలతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు కంపెనీ వెల్లడించింది.

* ప్రొస్టేట్‌ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే 80 ఎమ్‌జీ ఎంజాలుటమైడ్‌ జనరిక్‌ వర్షన్‌ మాత్రలను భారత్‌లోకి ప్రవేశపెట్టినట్లు బీడీఆర్‌ ఫార్మాసూటికల్స్‌ ప్రకటించింది. 4 స్ట్రిప్‌లుండే ప్యాకెట్‌ ధర రూ.24,480 అని తెలిపింది.

* దేశీయ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం(టిక్‌ టాక్‌ తరహా) చింగారీ యాప్‌కు 3 కోట్ల డౌన్‌లోడ్లు లభించాయి. భారత్‌తో పాటు యూఈఏ, అమెరికా, కువైట్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, వియత్నాంలలోనూ వినియోగదార్ల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని కంపెనీ పేర్కొంది.

* ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ కంపెనీ డీడబ్ల్యూఎస్‌ను కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. తద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోనున్నట్లు వివరించింది.

* సార్వభౌమ హామీ బాండ్లను విక్రయించడం ద్వారా రూ.8,500 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. అదే సమయంలో ఏడాదిలోగా ఆస్తుల విక్రయం ద్వారా రూ.18,000 కోట్లను పొందడానికీ ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) పి.కె. పుర్వార్‌ తెలిపారు.

* అమెరికాకు చెందిన న్యాయ సంస్థ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. తప్పుదోవ పట్టించే ఆ చర్యల వల్ల క్లాస్‌ యాక్షన్‌ దావా వేయడం ద్వారా పరిహారాన్ని కోరాలని బ్యాంకు భావిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.