close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జులై- సెప్టెంబరులో 46 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు: అనరాక్‌

దిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల విక్రయాలు జులై-సెప్టెంబరు త్రైమాసికంలో దాదాపు 46 శాతం క్షీణించాయి. కొవిడ్‌-19 విజృంభించిన నేపథ్యంలో గత మూడు నెలల కాలంలో 29,520 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని అనరాక్‌ సంస్థ తెలిపింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణేలలో గత ఏడాది ఇదే సమయంలో 55,080 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో చూస్తే అమ్మకాల్లో దాదాపు 57శాతం క్షీణత కనిపించిందని వెల్లడించింది. ఏడాది క్రితం 2,02,200 నివాస గృహాలను విక్రయించగా ఈ ఏడాది వీటి సంఖ్య 87,460 యూనిట్లకు పరిమితమయ్యిందని నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో 2019 జులై-సెప్టెంబరు మధ్య 3,280 నివాస గృహాలు విక్రయించగా ఈ ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 1,650గా ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.